అన్వేషించండి

Andhra Pradesh Cabinet: నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం- సూపర్‌ 6, బడ్జెట్‌ రూపకల్పనపై ప్రధాన చర్చ!

AP Cabinet : ఐదేళ్లు జరిగింది ఏంటీ? వచ్చే ఐదేళ్లు చేయాల్సిందేంటీ? ప్రజల ఆకాంక్షలు ఏంటీ? తక్షణ కర్తవ్యం ఏంటీ? వీటి ఆధారంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం కానుంది.

భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఇవాళ తొలిసారిగా సమావేశం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు సూపర్‌ సిక్స్‌తోపాటు ఇతర సమస్యలు, విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరం సందర్శించి వచ్చారు. రాజధాని అమరావతిలో కూడా టూర్ చేశారు. ఆర్థిక అంశాలపై కూడా ఆరా తీశారు. అందుకే వీటన్నింటిపై ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. 

వెలగపూడిలోని సచివాలయంలో చాలా రోజుల తర్వాత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు కీలకమైన ఐదు అంశాలకు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారు. మెగా డీఎస్సీపై ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు నాలుగువేల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్‌పై సంతకాలు చేశారు. ఈ అంశాలపై మంత్రమండలిలో చర్చించనున్నారు. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని పదే పదే చెబుతున్న ప్రభుత్వం దాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోనుంది. దీనిపై కూడా తొలి మంత్రిమండలిలో చర్చించనున్నారు. భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాటి అమలుకు సంబంధించిన ఆర్థిక వనరుల లభ్యతపై కూడా చర్చిస్తారని అంటున్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రాలను కూడా విడుదల చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. 

సూపర్‌ 6తో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాటి అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు. ఈ ఆరు పథకాలు ఎప్పుడు ఎలా అమలు చేస్తారో అన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలపై కూడా ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. 

2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కూడా రూపకల్పన చేయాల్సి ఉంది. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలువుతున్న హామీలు, ప్రభుత్వ ఖర్చులు అన్నింటిని బేరీజు వేసుకొని బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంది. సూపర్ 6 ను కూడా పరిగణలోకి తీసుకొని లెక్కలు వేయాలి. అందుకే నిధుల సమీకరణ మార్గాలు, ప్రజలపై భారం పడకుండా చేయాల్సిన చర్యలను చర్చించనున్నారు. 

గత ప్రభుత్వం హయాంలో చాలా విషయాల్లో కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్న వేళ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముఖ్యంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. ఇసుక, మద్యం పాలసీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ టైంలో మంత్రిమండలిలో ఈ అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా అన్నది సాయంత్రానికి తేలిపోనుంది.  

టాప్ హెడ్ లైన్స్

Fact Check On Amaravati Cost: అమరావతి నిర్మాణ ఖర్చుపై పొలిటికల్ హీట్.. వైఎస్ జగన్ విమర్శలకు ఫ్యాక్ట్‌చెక్ కౌంటర్
అమరావతి నిర్మాణ ఖర్చుపై పొలిటికల్ హీట్.. వైఎస్ జగన్ విమర్శలకు ఫ్యాక్ట్‌చెక్ కౌంటర్
AP Panchayat Elections Live Updates: ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
ఏపీలో రెండోదశ గ్రామ పంచాయతీ పోలింగ్.. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
AP Panchayat Elections: ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget