News
News
X

ఏపీలో స్కూల్స్‌ మూసివేయలేదన్న బొత్స - రాజీనామాకు సిద్ధమని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ మూసివేతపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య చర్చ నడిచింది. స్కూల్స్ మూసివేయలేదన్న బొత్స... విద్యలో ఏపీ ఉత్తమ ర్యాంకులో ఉందన్నారు.

FOLLOW US: 
Share:

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో స్కూల్‌ మెర్జింగ్‌పై డిస్కషన్ జరిగింది. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ... ఏపీలో ఒక్క స్కూల్‌ కూడా మూసి వేయలేదని చెప్పారు. విద్యను ప్రాధాన్య అంశంగా తీసుకొని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణంగా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాల్లోకి మారుతున్నారని టీడీపీ సభ్యులు వీరాంజనేయులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులకు, మంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందని... అందుకే ఆలాంటిదేమీ లేదని మంత్రి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. మూడు లక్షల మంది తగ్గారని అధికారులు చెప్పారన్నారు. న్యూఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మెర్జింగ్ విధానంతో కిలోమీటర్ పరిధిలో పాఠశాలలు లేకుండా పోయాయన్నారు. 

దీనిపై మంత్రి బొత్స రియాక్ట్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 102 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయన్నారు. 2018-19 సంవత్సరంలో 70,43000 విద్యార్థుల్లో ప్రభుత్వంలో 37 లక్షలు ఎయిడెడ్‌లో 2లక్షల 8వేలు, ప్రైవేటులో 31 లక్షల 14వేలు మంది చదివేవాళ్లు. 2022-23 లెక్కలు చూసుకుంటే... 70,18000 ప్రభుత్వంల 39,69640, ఎయిడెడ్‌లో లక్షా తొమ్మిదివేల మంది, ప్రైవేటులో 29 లక్షల 39వేల మంది చదువుతున్నారని తెలిపారు. సుమారు రెండు లక్ష మందికిపై విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నారని వివరించారు. 2014-19 మధ్యలో ఏపీలో 5వేల స్కూల్స్ మూసివేశారన్నారు. ఐదు వేల స్కూల్స్ పేర్లు సభ్యులకు ఇవ్వడానికి సిద్ధమన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల స్కూల్స్‌ను తెరిపించామన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన  ఏ ఒక్క స్కూల్‌ను మూసివేయలేదన్నారు. ఏవరైనా అలా చేసినట్టు ఎరైనా చెప్పగలరా అని సవాల్ చేశారు. 

బొత్స చేసిన సవాల్‌కు టీడీపీ సభ్యులు స్పందిస్తూ మాట్లాడుతుండగానే స్పీకర్ కట్ చేశారు.ఏ ఊరిలో స్కూల్‌ క్లోజ్ చేశారో మాత్రమే చెప్పాలని ఆదేశించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మళ్లీ బొత్స మాట్లాడుతూ... టీడీపీ వద్ద విషయం లేదని ఎద్దేవా చేశారు. విద్యా సంస్కరణలో భాగంగానే స్టేట్‌లో కూడా సీబీఎస్‌ఈ సిలబస్ తరహా విధానం తీసుకురావాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ టీచర్స్‌ను ప్రవేశ పెట్టామన్నారు. మూడో తరగతి నుంచే ప్రతి సబ్జెక్ట్‌కు ఓ టీచర్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కాన్సెప్టును మూడు కిలోమీటర్‌ పరిధిలో ఉన్న స్కూల్స్‌లో పెట్టాలనుకున్నామని అయితే మూడు కిలోమీటర్లు విద్యార్థులకు దూరమవుతుందన్న ఉద్దేశంతో దాన్ని కిలోమీటర్‌కు తగ్గించినట్టు చెప్పారు. ఇక్కడ కూడా కొన్నిరూల్స్ పెట్టామన్నారు. హైవేలు, వాగులు, చెరువుగట్లు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేశామన్నారు. మెర్జింగ్ చేసినప్పటికీ ఎక్కడా స్కూల్స్ మూసివేయలేదన్నారు. ఐదువేల నాలుగు వందల 19 పోస్టులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. ప్రతి 15రోజులకు ఓసారి రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి... విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. 

తర్వాత టీడీపీ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ... తమకు అనుకూలంగా ఉన్న విషయాలనే సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారిచ్చిన వివరాలను పరిశీలిస్తే.. 2021-22 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాలల్లో 44 లక్షల29 వేల 569మంది ఉంటే.. ఈ ఏడాది 40,31,239 మంది మాత్రమే ఉన్నారని ఈ ఏడాడి సుమారు నాలుగు లక్షళ మంది వెళ్లిపోయారన్నారు. ప్రభుత్వం ఏ స్కూల్‌ను మూసివేయడం లేదు కానీ... 3627 పాఠశాలల్లో మూడు నాలుగు, ఐదు తరగతులను వేరే పాఠశాలల్లోకి షిఫ్టు చేశారన్నారు. దీని వల్ల కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. 8,4 12 స్కూల్స్‌ను షిఫ్టు చేయడానికి రెడీ అవుతున్నారని ఆరోపించారు. దీని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. 

జాతీయ విద్యావిధానం ప్రకారం తీసుకున్న నిర్ణయమని.. దీని వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాము తీసుకున్న చర్యల వల్ల విద్యలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలోకి వచ్చిందన్నారు. గతంలో 14వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. దీనికి ప్రతిపక్షం రియాక్ట్ అవుతూ... విద్యలో ఏపీ 27వ స్థానానికి వెళ్లిందని గట్టిగా అరిచి చెప్పారు. దానికి బొత్స స్పందిస్తూ...విద్యలో ఏపీ 27వ స్థానంలో ఉంటే ఇక్కడే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు.  
 

Published at : 15 Mar 2023 11:00 AM (IST) Tags: YSRCP TDP AP Assembly Minister Botsa Satyanarayana Ap Assembly Budget Session 2023 AP Education Sector

సంబంధిత కథనాలు

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు - మంత్రి మేరుగు నాగార్జున

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు  - మంత్రి మేరుగు నాగార్జున

టాప్ స్టోరీస్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?