అన్వేషించండి

AP BharatNet Project: ఏపీలో భారత్ నెట్ కోసం కేంద్రంతో ఒప్పందం.. గ్రామాలకు ఇంటర్నెట్‌తో డిజిటల్ సర్వీసులు

BharatNet Project in Andhra Pradesh | ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓసీ ఇది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవానికి బాటలు వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ఇళ్లకు హై-స్పీడ్ ఫైబర్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ (Amended BharatNet Project) అమలు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 2,432 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) పేరుతో ఒక ప్రత్యేక విభాగం (SPV)ని కూడా ఏర్పాటు చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. డిజిటల్ భారత్ నిధి, ఏపీ ప్రభుత్వం పరస్పర సహకారంతో ఈ నిధులను వెచ్చించి ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాయి. రైట్ ఆఫ్ వే (RoW) అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్రస్థాయి సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,426 గ్రామ పంచాయతీలలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో భాగంగా మొదటి దశలోని 1,692 పంచాయతీల నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, రెండో దశలోని 11,254 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేస్తారు. అలాగే కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కూడా కనెక్షన్లు ఇస్తారు. ఈ డిజిటల్ కనెక్టివిటీ ద్వారా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఈ-గవర్నెన్స్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలు మారుమూల గ్రామాలకు సైతం వేగంగా అందుబాటులోకి రానున్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

డిజిటల్ విప్లవం, మెరుగైన జీవన ప్రమాణాలు
ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ గ్యాప్ చాలా మేరకు తగ్గుతుంది. విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఆన్‌లైన్ విద్యా వనరులు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్య రంగంలో టెలిమెడిసిన్ సేవలు మెరుగుపడతాయి. దీనివల్ల మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా పట్టణాల్లోని నిపుణులైన వైద్యుల సలహాలను వీడియో కాల్స్ ద్వారా పొందవచ్చు. అలాగే, రైతులకు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది.

ఆర్థికాభివృద్ధితో పాటు సుపరిపాలన
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పెరగడం వల్ల స్థానిక యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని ఉద్యోగాల ద్వారా  ఇది వలసలను తగ్గించడంలో సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలు పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వ పరంగా చూస్తే, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత పారదర్శకంగా అందుతాయి. సర్టిఫికెట్ల జారీ, పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజలకే వేగంగా చేరుతుంది. మొత్తంగా, ఈ ప్రాజెక్టు గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget