అన్వేషించండి

Modi Tour In Andhra Pradesh: ప్రధాని మోదీ టూర్ ఎఫెక్ట్- విజయవాడలో భారీగా ట్రాఫిక్ మళ్ళింపు

Modi Tour In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రధానమంత్రి మోదీ మే 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో రోజంతా ట్రాఫిక్‌ మళ్లించబోతున్నారు.

Modi Tour In Andhra Pradesh:ప్రధాన మోడీ అమరావతికి వచ్చేస్తున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్‌లో వెళ్ళాలి అనే అంశంపై ఏపీ డీజీపీ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

మే 2 న విజయవాడపై నుంచి వెళ్లే వాహనాల దారి మళ్ళింపు ఇలా..!

మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి.

ట్రాఫిక్ మళ్లింపులు (భారీ, ఇతర వాహనాలతో సహా) : 

1. చెన్నై వైపు నుంచి విశాఖపట్నానికి విజయవాడ మీదుగా,  ఇబ్రహీంపట్నం, నందిగామ వైపునకు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలని దారిమళ్లించారు. వీటని త్రోవగుంట నుంచి చీరాల- బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది. అదే విధంగా విశాఖపట్నం నుంచి చెన్నైవైపు వాహనాలు కూడా అలానే రావాల్సి ఉంటుంది. 

2. చిలకలూరిపేట వైపు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరిపేట నుంచి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.  

3. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. 

4. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి - వేమూరు- కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. 

5. గన్నవరం వైపు నుంచి హైదరాబాద్‌కు ఆగిరిపల్లి - శోభనాపురం గణపవరం మీదుగా వెళ్లాలి. మైలవరం జి. కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా దారి మళ్లించారు. 

6. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు- మైలవరం జి. కొండూరు - ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలి. 

మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు : 
చెన్నై నుంచి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా వేస్తున్నారు.  

విశాఖపట్నం నుంచి చెన్నై: ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేస్తారు. ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2, 2025న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతిస్తారు.  

ఈ సమయంలో ట్రాఫిక్ లేకుండా వాహనాలు సజావుగా ముందుకు సాగేలా ప్రయాణీకులు సహకరించాలని కోరుతున్నట్టు ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Embed widget