Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీటీలకు మాన్యువల్‌గా ట్రాన్స్‌ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదలీలపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. ఉపాధ్యాయుల డిమాండ్ మేరకు మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌కు ఓకే చెప్పింది.

Andhra Pradesh Teachers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీటీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. వారికి మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
ఎస్జీటీల కౌన్సిలింగ్‌పై ముఖ్య ప్రకటన
— Lokesh Nara (@naralokesh) June 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం
ప్రజా ప్రతినిధులు, టిడిపి
ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ గార్లతో ఎస్జీటీ కౌన్సిలింగ్‌పై చర్చించాం.…
నేతలతో చర్చించి నిర్ణయం
నారా లోకేష్ ఎక్స్‌లో ఏం రాశారంటే" పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌తో ఎస్జీటీ కౌన్సెలింగ్‌పై చర్చించాం. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం." అని వెల్లడించారు.





















