అన్వేషించండి

Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం.. దేశంలో తొలి సహా దీని ప్రత్యేకతలు ఇవే

Quantum Computing | తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ భవనానికి పునాది వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించి పునాదిరాయి వేశారు. భవిష్యత్ టెక్నాలజీకి చిరునామాగా నిలవబోయే ఈ వ్యాలీని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. క్వాంటం కంప్యూటింగ్ సహా, కమ్యూనికేషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం సెన్సార్స్, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ నిలవనుంది.

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్‌ వ్యాలీ బిల్డింగ్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, పి.నారాయణ, కందుల దుర్గేష్‌, ఐబీఎం, టీసీఎస్,ఎల్  అండ్ టీ సంస్థలకు చెందిన ప్రతినిధులు, తిరుపతి, చెన్నై ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు  పాల్గొన్నారు. ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్, వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్‌

ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వరుసల్లో 8 భారీ టవర్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఒకటి 48 అంతస్తులు కాగా, మరొకటి 29 అంతస్తుల ఎత్తుతో రాజధానికే తలమానికంగా నిలిచేలా ప్లాన్ చేశారు. మొత్తం 8.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు సాగాయి. అలాగే, రెండెకరాల స్థలంలో 43 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ వన్ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.


Amaravati Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం.. దేశంలో తొలి సహా దీని ప్రత్యేకతలు ఇవే

ఈ ప్రతిష్టాత్మక టవర్ల నిర్మాణ బాధ్యతను ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) తీసుకోగా, క్వాంటం కంప్యూటర్ల తయారీలో గ్లోబల్ జెయింట్ ఐబిఎం (IBM) భాగస్వామి అయ్యింది. వీటికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సేవలను అందించేందుకు టీసీఎస్ (TCS) ముందుకు వచ్చింది. అమరావతిలో 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి ప్రపంచ స్థాయి నగరాల సరసన మన రాజధాని కూడా నిలిచింది.

క్వాంటం కంప్యూటర్లు ఎగుమతి

ఈ క్వాంటం వ్యాలీ సెంటర్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా అమరావతి అవతరించింది. ప్రభుత్వ లక్ష్యం మేరకు అదే ఏడాది ఆగస్ట్ నాటికి క్వాంటం వ్యాలీని ప్రారంభించి, డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

భారత్‌లో తొలి ఐక్యూసీ అమరావతిలో..
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ క్వాంటం నెర్వ్ సెంటర్ గా మారుతుంది. అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి క్వాంటం హార్డ్ వేర్ యాక్సెస్ ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం కొత్త ఆల్గారిథమ్స్, క్రిప్టో గ్రఫీ అవసరం అవుతుంది. దానికి అనుగుణంగా నిపుణులు అవసరం. అందుకే అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 35 క్యూఐసీలతో పాటు భారత్‌లో మొదటి క్యూఐసీ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది - ఐబీఎం ప్రతినిధి అమిత్ సింఘీ 

35 లక్షల మంది విద్యార్ధులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ
వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్‌ను ఆవిష్కరించారు. వైసర్ సంస్థ ప్రతినిధి వరదాన్ మాట్లాడుతూ.. ‘ అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా క్వాంటం రంగంలో నిపుణుల్ని తయారు చేసేలా వైసర్ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా దశలవారీగా 2035 నాటికి 35 లక్షల మంది విద్యార్ధులకు క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తాం. క్వాంటం హార్డ్ వేర్, సిమ్యులేటర్లు, టూల్ కిట్స్ సహా 10 వేల నిముషాల క్వాంటం హెచ్ పీసీ కంప్యూటర్ క్రెడిట్స్ ను ఇచ్చేలా నిర్ణయం. క్వాంటం రెడీ వర్క్ ఫోర్సును తయారు చేసే లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయనున్నాం. ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించే విజన్ ఆంధ్రప్రదేశ్ లో భారత్ లోనూ కనిపిస్తోంది. భారతీయుడిగా దీని పట్ల నేను గర్విస్తున్నాను. అమరావతిలో వైజర్ క్వాంటం ట్యాలెంట్ హబ్ ను ఆవిష్కరిస్తున్నాం. వైసర్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారి అమరావతిలో ఈ  ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Somireddy Chandramohan Reddy: ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget