By: ABP Desam | Updated at : 29 Nov 2022 07:21 PM (IST)
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ లో సీఎం జగన్
YS Jagan Attends Ali Daughter Reception: ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు పర్యటనకు వెళ్లారు. సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌కు ఏపీ సీఎం చేరుకున్నారు. నటుడు అలీని, ఆయన కుటుంబసభ్యులను కలిసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ తరువాత వధువు మహ్మమద్ ఫాతిమా రమేజున్, వరుడు షేక్ షహయాజ్‌లను సీఎం జగన్ ఆశీర్వదించారు. అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు.
నటుడు అలీ కూతురు ఫాతిమా వివాహం కొన్ని రోజుల కిందట అట్టహాసంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ వేడుక (Ali Daughter Wedding Reception )కు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు, చిరంజీవి-సురేఖ దంపతులు, నాగార్జున - అమల దంపతులు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, వెంకటేశ్, బ్రహ్మానందం, ఏపీ మంత్రి రోజాతోపాటు రాజశేఖర్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శివారెడ్డి దంపతులు ‘మా‘ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తొలి పత్రిక జగన్‌కే ఇచ్చిన అలీ దంపతులు..
టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ కొన్ని రోజుల కిందట సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. అంతకు కొన్న రోజుల ముందు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహా దారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ తన భార్య జుబేదాతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయం అవడం, ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అలీ వివాహ ఆహ్వాన పత్రిక తొలి ప్రతిని సీయం జగన్‌మోహన్ రెడ్డికి అందించారు. పెళ్లి పత్రిక స్వీకరించిన జగన్, తప్పకుండా వివాహానికి వస్తాను అని మాటిచ్చారు. నేడు గుంటూరులో జరిగిన ఫాతిమా మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు జగన్.
అలీ పెద్ద కుమార్తె ఫాతిమా మెడిసిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అలాగే వరుడు షేక్ షహయాజ్ కూడా డాక్టర్ కావడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి ఆలీ ఇంట పెళ్లి వేడుక (Ali Daughter Wedding)లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నటుడి భార్య జుబేదా సోషల్ మీడియాలో షేర్ చేసి తమ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అలీ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార పలు రంగాల ప్రముఖులు వివాహ వేడుక, మ్యారేజ్ రిసెప్షన్‌కు హాజరవుతున్నారు.
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
AP News Developments Today: కుప్పంలో పాదయాత్ర హడావుడి- విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవం
కన్నా లక్ష్మీనారాయణతో అధిష్ఠానం ప్రతినిధి భేటీ- విభేదాలు పోయినట్టేనా!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!