Sajjala On Chandrababu : తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు, చంద్రబాబు ప్లాన్ ఇదే- సజ్జల
Sajjala On Chandrababu : చంద్రబాబు, దిల్లీలో ప్రధానిని కలవడంపై వస్తున్న కథనాలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు మళ్లీ బీజేపీ పాట పాడుతున్నారని, తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేసుకునేందుకు పావులు కదుపుతోందన్నారు.
Sajjala On Chandrababu : దిల్లీలో ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంపై ఏదో ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఏపీలో గడిచిన మూడేళ్లలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని విమర్శించారు. ప్రతీ ఎన్నికల్లో ఎవరో ఒకరి తోడులేకుండా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు ఉండవన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని భ్రమల్లో టీడీపీ ఉందన్నారు. దిల్లీలో ప్రధానిని కలిసిన ఒక ఫొటో పెట్టుకుని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దిల్లీలో మీడియాతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వచ్చేస్తోందని డబ్బా కొట్టారన్నారు. చంద్రబాబు టైంలో చెప్పుకోడానికి ఒక్క కార్యక్రమం కూడా జరగలేదన్నారు.
టీడీపీ అనుకూల కథనాలు
ప్రధాని మోదీ, చంద్రబాబుతో మాట్లాడుతున్న ఫొటోతో వివిధ ప్రచారాలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబు ఇది మీ ఇళ్లే అనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు రావోచ్చన్నారని కథనాలు రాశారన్నారు. అయితే ప్రధాని మోదీ వీటిపై ఎలాగో ఖండించరని, అందుకే టీడీపీకి అనుకూలంగా కథనాలు రాశారని సజ్జల ఆరోపించారు.
1+1 ఆఫర్
చంద్రబాబు మళ్లీ బీజేపీ పాట
'2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీ ఓడిపోతుందని చంద్రబాబుకు అనుమానం వచ్చి తీసుకోవాల్సినవి అన్నీ తీసుకుని బీజేపీపై తిరగబడ్డారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో మళ్లీ చంద్రబాబు బీజేపీ పాట పడుతున్నారు. ఈ ప్రయత్నం ఇలా కొనసాగవచ్చు. అయితే టీడీపీ చేస్తున్న రాజకీయంలో ఎక్కడైనా ప్రజలు, వారి సమస్యలు ఉన్నాయా?. వైసీపీ ముందు నుంచీ ఒకే స్టాండ్ తీసుకుంది. ప్రజా సమస్యలపై పోరాడుతుంది.' - సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు
చంద్రబాబును రిజెక్ట్ చేశారు
వైసీపీ గెలిచినప్పటి నుంచి చంద్రబాబు ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారని సజ్జల ఆరోపించారు. అయితే చంద్రబాబు రిజెక్ట్ చేసి మూడేళ్లయ్యిందన్నారు. ఈ విషయం ఆయనకు గుర్తుకు రావడంలేదన్నారు. దిల్లీ వెళ్లి చంద్రబాబు ఏదేదో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చంద్రబాబును పిలిచినట్లు కలరింగ్ ఇస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఊతకర్ర కోసం చూస్తోందని సజ్జల ఆరోపించారు. ఏపీలో బీజేపీ సాయం కోసం టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.