అన్వేషించండి

Minister Merugu Nagarjuna : వాహన డీలర్స్ పై క్రిమినల్ కేసులు, అవసరమైతే సీఐడీ రంగంలోకి - మంత్రి మేరుగు నాగార్జున

Minister Merugu Nagarjuna : టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లలో అడ్వాన్సులు తీసుకుని వాహనాలు అందించని డీలర్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.

Minister Merugu Nagarjuna : టీడీపీ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో  11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలను సమీక్షించారు. టీడీపీ హయాంలో ఈ-ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రెన్ క్లీనర్ల సరఫరా కోసం టెండర్లు పొంది ప్రభుత్వం నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సుగా తీసుకున్న కెనటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ (పూణే), వెంకటేశ్వరా ట్రేడర్స్ (తాడేపల్లి), ఈగల్ అగ్రిఎక్విప్ మెంట్స్ (కావలి), ఎంట్రాన్స్ ఆటోమోబైల్స్ (పెద్ద తాడేపల్లి) సంస్థలకు చెందిన డీలర్లు వద్ద రూ.46 కోట్లు పొందారు. దానికి సంబంధించిన వాహనాలు సరఫరా చేయడంగానీ, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడం గానీ జరగలేదని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఎస్సీ కార్పొరేషన్ సొమ్మును తిరిగి రాబట్టడానికి ఆయా డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సీబీ సీఐడీకి ఫిర్యాదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కు సంబంధించిన బకాయిల వసూళ్లను ముమ్మరం చేయాలని కోరారు. ఎస్సీలకు చెందిన సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగమైనా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ఈ.డీలు వెనక్కి 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి నాగార్జున ఆదేశించారు. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఇ.డి)లుగా పనిచేస్తున్న వారిలో ఏడాది కాలం సర్వీసును పూర్తి చేసిన వారిని వారి సొంత శాఖలకు వెనక్కి పంపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో భూమి కొనుగోలు పథకం (ఎల్పీఎస్)  ద్వారా ఎస్సీలకు కేటాయించిన 25 శాతం రుణ మొత్తాన్ని మాఫీ చేసే అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలనలో ఉందన్నారు.  ఈ విషయంపై సీఎం త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వెల్లడించారు.

అజయ్ పథకంలో 

పీఎం అజయ్ పథకంలో భాగంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.60 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రాబోయే జనవరి నెలాకరు లోపుగా అమలు చేస్తామని మంత్రి నాగార్జున ప్రకటించారు. ఈ పథకం క్రింద 2022-23 సంవత్సరంలో మరో రూ.130 కోట్ల మొత్తం మంజూరు అయ్యిందన్నారు. స్వచ్ఛత ఉద్యమై యోజన పథకం కింద రూ.120 కోట్లు డీ సెజ్లింగ్ యంత్రాల కొనుగోలు కోసం మంజూరు కాగా దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచల ప్రకారంగా ఎస్సీలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎక్కడా అలసత్వం లేకుండా పని చేయాలని నాగార్జున కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget