Ambati Rambabu On Pawan : 'శ్వాస తీసుకో ప్యాకేజీ వద్దు' - పవన్ కు మంత్రి అంబటి కౌంటర్
Ambati Rambabu On Pawan : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ నేతలకు జనసేనాని కౌంటర్ ఇచ్చారు. అయితే పవన్ కౌంటర్ అంబటి రాంబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
Ambati Rambabu On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. పవన్ ఎన్నికల ప్రచార రథం వారాహి విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చేశారు. పసుపు రంగు మార్చుకోవాలని సూచించారు. దీనికి కౌంటర్ గా పవన్ ... కొన్ని రోజులకు ఊపిరి తీసుకోవడం ఆపేయమంటారా? అంటూ ట్వీట్ చేశారు. పవన్ విమర్శలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో స్పందించారు. శ్వాస తీసుకో... ప్యాకేజీ వద్దంటూ అంబటి రాంబాబు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంబటి ట్వీట్ పై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. అంబటిని ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
శ్వాస తీసుకో ...ప్యాకేజీ వద్దు ! @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) December 9, 2022
రంగు వివాదం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రచార రథాన్ని తయారు చేయించారు. దీనికి వారాహి అని నామకరణం చేశారు. అయితే ఈ వాహనానికి వేసిన రంగుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారాహి వెహికల్ కు మిలటరీ వాహనాలకు మాత్రమే వినియోగించే ఆలీవ్ గ్రీన్ కలర్ వేశారని, అది నిషేధిక రంగు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. అలాగో త్వరలోనే టీడీపీలో జనసేన కలిసిపోతుందని, అందుకు ముందస్తుగా ఆ వాహనం కలర్ పసుపు వేయించుకోవాలని పేర్ని నాని సూచించారు. పేర్ని నాని వ్యాఖ్యలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టులతో మొట్టికాయలు తిన్నారంటూ విమర్శించారు. కనీస అవగాహన లేకుండా కొందరు మైకుల ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతుంటారన్నారు. అన్ని విషయాలను పరిశీలించాకే జనసేన ముందుకు వెళ్తుందని, వారాహి రంగు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అభ్యంతరం ఉంటే రవాణాశాఖ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
కారు నుంచి కట్ డ్రయర్ వరకూ
వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వారాహి వాహనంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట తన సినిమాలు ఆపారని.. తర్వాత తాను విశాఖ పర్యటనకు వస్తే హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్లనియ్యలేదని ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే..."మొదట మీరు నా సినిమాలను ఆపేశారు; విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. సిటీ వదిలి పెట్టి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో మీరు నా కారుని బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే, తర్వాత నేను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా?" అంటూ ట్వీట్ చేశారు. వారాహి వెహికల్ కలర్ లాంటి ఆలివ్‌గ్రీన్ కలర్ షర్ట్‌ను పోస్ట్ చేసి వైసీపీ ఇదైనా నేను వేసుకోవచ్చా అంటూ పవన్ క్వశ్చన్ చేశారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. వైసీపీ నేతల వేధింపులతో కారు నుంచి కట్ డ్రయర్ వరకు కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. టికెట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వల్ల కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు.
కారు to కట్‌డ్రాయర్
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
————————-
YCP టిక్కట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి AP అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి.
ఇప్పటికే AP లో వీరి లంచాలు, వాటాలు వేధింపులవలన
“ కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్..