
Pawan Kalyan On CM Jagan : దేశంలోనే అత్యంత ధనిక సీఎం, ప్రతీ పైసా ఆయన చేతిలోకే- సీఎం జగన్ పై పవన్ సెటైర్లు
Pawan Kalyan On CM Jagan : వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యా్ణ్ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. పేద రాష్ట్రానికి ధనిక సీఎం అంటూ విమర్శలు చేశారు.

Pawan Kalyan On CM Jagan : సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అత్యంత ధనిక సీఎం అని సెటైర్లు వేశారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం... కామ్రేడ్స్ చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ధనిక సీఎం రూల్ చేస్తున్న పేద రాష్ట్రం అన్నారు.
2) In Andhra Pradesh there are no Classes, All People have been made as Slaves to the Fiefdom of YCP.
— Pawan Kalyan (@PawanKalyan) February 1, 2023
From Land to Sand, From Liquor to Mines, from Forests to Hills, From Paper to Red Sandalwood every penny generated from AP is in the hands of the Richest CM, Truly CLASSic!
ప్రతి పైసా సీఎం జగన్ చేతిలో పడాల్సిందే
భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు రాష్ట్రంలో ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో పడాల్సిందే అని పవన్ ఆరోపించారు.ఏపీలోని పేదల జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని వందల కోట్లకు వైసీపీ అమ్మేసిందని విమర్శించారు. రాష్ట్రంలో మిడిల్ క్లాస్ ను అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం మిడిల్ క్లాస్ ను కేవలం టాక్స్ పేయింగ్ సేవకులుగా మాత్రమే పరిగణిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడుల గలాక్సీనే తీసుకువచ్చిందని, అలాంటప్పుడు దావోస్ ఎవరికి కావాలని సెటైర్లు వేశారు. ఐటీ మంత్రి నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లను ప్రారంభారని, ఇక ఐటీ కంపెనీల ఏర్పాటు కోసమే వేచి ఉన్నారంటూ పవన్ వరుసగా ట్వీట్చేశారు. రాష్ట్రంలో ఇది మరో క్లాస్ చట్టం అని సెటైర్లు వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

