అన్వేషించండి

AP High Court : సీఆర్డీఏకు షాక్ - రైతుల ప్లాట్లు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు

Amaravati farmers : అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది.

AP High Court :    ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కమిషనర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోటీసులు, ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 గతంలో భూసమీకరణ కింద రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. వీటిని రద్దు చేస్తూ మొత్తం 862 మందికి సీఆర్డీయే కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సదరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీయే చట్టం కింద భూసమీకరణలో ఇచ్చిన ఫ్లాట్లను రద్దు చేయడంపై వాదనలు జరిగాయి. ఈ ప్లాట్ల రద్దు సీఆర్డీయే చట్టానికి విరుద్దమని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. అసలు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారని వాదించారు.

అయితే ప్రభుత్వం మాత్రం సీఆర్డీయే చట్టంలో మార్పులు చేశామని, కాబట్టి ఈ నోటీసులు చెల్లుతాయని వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు .. సీఆర్డీయే కమిషనర్ రైతులకు ఫ్లాట్లు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రైతులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు సక్రమంగా లేకపోవడంతో పాటు వారికి కౌలు కూడా దక్కడం లేదు. 

రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు.  ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకొంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు చట్ట విరుద్ధం కావడంతో కోర్టు కొట్టి వేసింది.                     

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget