By: ABP Desam | Updated at : 04 May 2023 08:25 PM (IST)
మే 9 వ తేదీన అమరావతి పై సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు సుప్రీంకోర్టులో మళ్లీ ముందుకు వచ్చింది. ఈ నెల తొమ్మిదో తేదీన విచాణరణకు లిస్ట్ అయింది. జస్టిస్ కే.ఎం జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అమరావతిని అన్ని మౌలిక వసతులతో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని కోర్టు మార్చి 3, 2022న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పులోని రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర శాసనసభ అధికారాలపై కోర్టు నిర్ణయం తీసుకోలేనందున ఏపీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
గత విచారణలో అమరావతి పై పిటిషన్ల విచారణ సందర్భంగా.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరారు. తమ స్టే పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. జులై 11 న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. జులై 11 వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా వాడీ వేడి వాదనలు జరిగాయి. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదని.. ఏపీ తరఫున కెకె వేణుగోపాల్ వాదించారు. జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ కెఎం జోసెఫ్.. అందుకే ఈ కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తాను రిటైర్ అవుతున్న సమయంలో.. అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ గత విచారణలో వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించి ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతులు ఏళ్ల తరబడి చనిపోయారని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతీ సారి అమరావతి కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం మెన్షన్ చేస్తోంది. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నమే చేయడంతో మే 9వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే వస్తే పరిపాలనా రాజధానిని తరలించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సీఆర్డీఏ చట్టం ప్రకారం.. రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైతులు తమకు న్యాయం జరుగుతుందనే భావిస్తున్నారు. రాజధాని కోసం మాత్రమే తాము భూములిచ్చారని.. ఇప్పుడు తమ భూముల్ని రాజధాని కోసం కాకుండా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వారు న్యాయపోరాటం చేస్తున్నారు.
Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!