అన్వేషించండి

AP Cabinet : మంత్రులకు సీఎం జగన్ క్లాస్, మరోసారి కేబినెట్ విస్తరణ- పార్టీ వర్గాలు ఏమంటున్నాయ్?

AP Cabinet : ఏపీలో మరోసారి మంత్రి వర్గవిస్తరణ ఉంటుందోన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి.

AP Cabinet : ఏపీలో మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుందంటూ ఇటీవ‌ల పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతుంది. ఇటీవ‌లె మంత్రి వ‌ర్గం రెండో ద‌ఫా విస్తర‌ణ జ‌రిగిన‌ప్పటికీ ఆయా శాఖ‌ల మంత్రుల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నార‌న్న వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో కూడా జ‌గ‌న్ ఒక‌రిద్దరు మంత్రుల‌కు క్లాస్ తీసుకున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది. అంతేకాదు ప‌నితీరు మార్చుకోక‌పోతే, మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల్సి వ‌స్తుంద‌నే సంకేతాలు కూడా ఇచ్చార‌ని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవ‌హ‌రం ఇప్పుడు ఏపీలో ప‌లుర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతుంది.

మంత్రులకు క్లాస్! 

 దాదాపుగా మూడు సంవ‌త్సరాల త‌రువాత ఏపీలో కేబినేట్ ను విస్తరించారు. సీఎం జ‌గ‌న్ మొద‌ట్లోనే స్పష్టంగా కేబినెట్ విస్తర‌ణపై క్లారిటీ ఇచ్చారు. రెండున్నర సంవ‌త్సరాల పాటు కేబినెట్ మంత్రులు కొనసాగుతార‌ని వెల్లడించారు. అయితే క‌రోనా ప‌రిస్థితులు కార‌ణంగా మంత్రివ‌ర్గం విస్తర‌ణ ఆల‌స్యం అయ్యింది. మూడు సంవ‌త్సరాల త‌రువాత కేబినెట్ ను సీఎం జ‌గ‌న్ విస్తరించారు. కొంద‌రు సీనియ‌ర్లను కంటిన్యూ చేసి, కొత్తవారికి అవ‌కాశం ఇచ్చారు. అయితే రెండో ద‌ఫా విస్తర‌ణ జ‌రిగిన త‌రువాత కేబినెట్ లో మంత్రుల ప‌నితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారనే స‌మాచారం సీఎంవో కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేబినెట్ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ మంత్రుల‌తో ప్రత్యేకంగా స‌మావేశం అయిన త‌రువాత‌, కొంద‌రు మంత్రుల‌తో జ‌గ‌న్ వ‌న్ టూ వ‌న్ గా కూడా మాట్లాడార‌ని, అందులోనే ఐదుగురి మంత్రుల‌కు క్లాస్ తీసుకున్నార‌ని పార్టీలో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ప‌రిణామాలపై పార్టీలో ఇప్పడు ఓ టాక్ నడుస్తోంది. మంత్రి వ‌ర్గ విస్తర‌ణ కూడా ఉంటుంద‌ని, తాజాగా బాధ్యత‌ల‌ను తీసుకొని 5గురు మంత్రుల‌ను త‌ప్పిస్తార‌ని, అందులో ఒక మ‌హిళా మంత్రి కూడా ఉన్నార‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది.

పార్టీ వ‌ర్గాలు ఏమంటున్నాయి? 

అయితే ఇటీవల బాధ్యతలు తీసుకున్న మంత్రుల‌ను త‌ప్పించే అంశాన్ని పార్టీ వ‌ర్గాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఇదంతా అస‌త్యప్రచారం అని పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు. మంత్రిగా అవ‌కాశం వ‌చ్చిన వారు త‌మ ప‌నితీరును మ‌రింత మెరుగుప‌ర‌చుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి సీఎం వారికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చార‌ని చెబుతున్నారు. పార్టీతో పాటుగా ప్రభుత్వంలో కూడా మంత్రులు కీల‌కంగా వ్యవ‌హ‌రించాల్సిన అంశాల‌ను సీఎం జ‌గ‌న్ స్వయంగా మంత్రుల‌కు వివ‌రించారని, రాజ‌కీయంగా ఎప్పటిక‌ప్పుడు వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణంలోకి తీసుకొని వాటిని ఖండించి, వాస్తవాల‌ను ప్రజ‌ల‌కు తెలియచెప్పటంలో మంత్రుల పాత్రను సీఎం వివ‌రించార‌ని అన్నారు.

ప‌నిలో ప‌నిగా వార్నింగ్ ఇచ్చారా? 

వైసీపీ రాజ‌కీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌టంతో పాటు, రాజ‌ధాని నిర్మాణం నిలిచిపోవ‌టం, రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ త‌యార‌య్యిందంటూ ప్రతిప‌క్షాల విమ‌ర్శలు చేయ‌టంతో పాటుగా, జ‌గ‌న్ ఫ్యామిలీపై లిక్కర్ అమ్మకాలపై ఆరోప‌ణ‌ల‌ను గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కోవ‌టంలో మంత్రులు పూర్తిగా విఫ‌లం అయ్యారని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప్రజ‌ల్లోకి వెళ్లి వాస్తవాల‌ను వివ‌రించేందుకు మంత్రులు ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లటం లేద‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉంది. ఇదే విష‌యాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లటంతో ఆయ‌న మంత్రుల‌కు త‌నదైన శైలిలో వివ‌రించార‌ని అంటున్నారు.  

Also Read : KCR Jagan Friendship : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెంటే జగన్ ఉంటారంటున్న తెలంగాణ మంత్రి! పీకే ఇద్దర్నీ కలుపుతున్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget