అన్వేషించండి

CM Jagan Delhi Tour : అమిత్ షాకూ జగన్ విజ్ఞప్తులు - రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై క్లారిటీ వచ్చేసినట్లేనా ?

అమిత్ షాతో భేటీ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి బయలుదేరారు సీఎం జగన్. ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను అమిత్ షాతోనూ చర్చించినట్లుగా తెలుస్తోంది.


CM Jagan Delhi Tour :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.  చర్చలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.  రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్‌ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఇరువరి మధ్య దాదాపుగా గంట పాటు భేటీ జరిగింది. 

ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీలు

అమిత్ షా జగన్ మధ్య భేటీలో రాజకీయాలపైనా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం అవుతుంది. ఈ అంశంపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత సీఎం జగన్ తాడేపల్లి పయనం అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్  పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు.

పోలవరం నిధులపై ప్రధానంగా దృష్టి

మంత్రలతో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర అంశాలపై చర్చించారు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలు, బకాయిల విడుదల తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. వివిధ పద్దుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణ పరిమితిలో కోతలు విధించడం సరికాదని నివేదించారు.   తర్వాత  కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కూడా సమావేశమయ్యారు.  పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, నిధులు ఎప్పటికప్పుడు విడుదల తదితరాలను ప్రస్తావించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే మద్దతని హామీ ఇచ్చారా ?

ఇటీవలే దావోస్‌లో పెట్టుబడుల సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన జగన్ రెండు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి ప్రారంభమయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతిస్తామని ఆయన కేంద్రానికి చెప్పడానికి వెళ్లారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందే బీజేపీతో కాస్త దగ్గరగా ఉండే బిజూ జనతాదళ్ చీఫ్, ఒడిషా సీఎం కూడా ఇలాగే ప్రధానితో భేటీ అయ్యారని గుర్తు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget