Achennaidu : అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన అచ్చెన్న ! ఇచ్చిన సమాధానం ఇదే..
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులపై వివరణ ఇచ్చారు. తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యలు బాధపెడితే ఉపసంహరించుకుంటానన్నారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో ఆయనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గతంలో వివిధ కారణాల వల్ల అచ్చెన్నాయుడు హాజరు కాలేదు. ఇవాళ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. స్పీకర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒక వేళ తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే ఉపసంహరించుకుంటానని తెలిపారు. అయితే అచ్చెన్నాయుడు పేరుతో విడుదలైన ప్రెస్‌నోట్ విషయంలో ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపిందని.. ప్రెస్‌నోట్‌పై తన సంతకం లేదని అచ్చెన్నాయుడు కమిటీకి తెలిపారు. Also Read : బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా వేయాలంటున్న రఘురామ
ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారని తెలిపారు. తాను ప్రెస్‌నోట్ ఆఫీసులో పెడితే తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని చెప్పారన్నారు. పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ వివాదాన్ని తాను పొడిగించదల్చుకోలేదని.. తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పినందున వివరణను మిగిలిన సభ్యులకూ పంపుతామన్నారు. సభ్యుల అభిప్రాయాల మేరకు అచ్చెన్నపై విషయాన్ని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి మించి విద్యుత్ బకాయిల వివాదం
ఒక్క అచ్చెన్నాయుడు విషయంలోనే కాకుండా కూన రవికుమార్, మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ ప్రివిలేజ్ కమిటీ విచారమ జరుపుతోంది. నోటీసు తీసుకునే సమయంలోనే కూన రవి కుమార్ తాను అందుబాటులో ఉండనని స్పష్టం చేశారు. ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లుగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ తెలిపారు. గతంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఎస్ఈసీ నిమ్మగడ్డపై తమ హక్కులకు భంగం కలిగించారని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. సభాహక్కుల ఉల్లంఘన నేరం కింద ఆయనను విచారించాలని అప్పట్లో నిర్ణయించారు. Also Read : టాలీవుడ్ పెద్దలతో 20న జగన్ భేటీ
అయితే ఎస్‌ఈసీ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తారా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అసెంబ్లీలోని రూల్ నెం 212, 213 కింద ఎస్ఈసీని పిలిపించవచ్చని గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్ కమిటీ వాదిస్తోంది. అయితే ఆర్టికల్ 243 ప్రకారం ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని ఎలా పిలిపిస్తారని కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగతంగా హాజరు అంశంపై ప్రివిలేజ్ కమిటీ కూడా అంత సీరియస్‌గా తీసుకోనట్లుగా కనిపిస్తోంది.Also Read : ఏపీలో స్కిల్ కాలేజీల ఫెస్టివల్