News
News
X

AP Aadhar Card : ఏపీలో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవడం చాలా సులువు - ఐదు రోజులే బంపర్ ఆఫర్ !

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ అప్ డేట్ సేవలు ఐదు రోజుల పాటు అందిస్తారు.

FOLLOW US: 
Share:

AP Aadhar Card : ఆధార్ కార్డులో పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా ఫోటో మార్చుకోవడం.. లేకపోతే ఆడ్రస్ మార్చుకోవడం చాలా పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇటీవల కేంద్రం పదేళ్లకోసారి అప్ డేట్ చేయించుకోవాలని చెబుతోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో వైపు ఆధార్ కేంద్రాలు తగ్గిపోయాయి.  ఈ బాధల నుంచి విముక్తి కల్పించడానికి ఏపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని  అప్‎డేట్ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు చేసింది.  జనవరి 19, 20,21,23,24 తేదీల్లో వరుసగా ఐదురోజుల పాటు ఆధార్ అప్‎డేట్ సేవలు ఉండనున్నాయి. 

ఫిబ్రవరిలో రెండో విడత అవకాశం కూడా ఉంటుంది !

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రెండో విడత క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే పనులన్నీ నిలిచిపోయతాయి. వీటిని ద్రుష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్రంలో దాదాపు 80లక్షల మంది ఆధార్ అప్ డేట్ చేసుకోని వారున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిష్కరించేందుకు ప్రత్యేక క్యాంపులతో ఆధార్ అప్ డేట్ కు ప్రభుత్వ చర్యలు చేపట్టింది. 

పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం సూచన

ఇవేకాకుండా ఆధార్ కార్డుల జారీ సంస్థ UIDAIఈ మధ్యే కొత్తగా తీసుకువచ్చని నిబంధనల ప్రకారం 10ఏ ళ్లకోసారి ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఆప్ డేట్ చేసుకోవల్సిందేనని తెలిపింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాషన్‌మోహన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలందరికి ఈ క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ ఆప్ డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

పుట్టిన రోజు మాత్రం ఒక్క సారే మార్చేందుకు వీలు..  అడ్రస్, ఫోన్ నెంబర్లు ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు

ఆధార్ కార్డ్ అడ్రస్ అప్‌డేట్ కోసం కొన్ని ధృవపత్రాలు తీసుకెళ్లాలి. ఎవరైనా ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసినట్లయితే అది ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయరు. ఆధార్ కార్డ్ సమాచారాన్ని మార్చేటప్పుడు, మీరు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని సురక్షితంగా ఉంచాలని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది కార్డ్ ప్రాసెస్ అయిందో లేదో ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయకున్నా.. గ్రామ, వార్డు సచివాలయ కేంద్రాల్లో చేస్తారు.  రుజువుగా అభ్యర్థించిన పత్రాలను మాత్రమే జతచేసి దరఖాస్తుతో అందించాలి. సవరించిన ఆధార్ కార్డు రిజిస్టర్డ్ చిరునామాకు  పంపుతారు. 

Published at : 19 Jan 2023 03:03 PM (IST) Tags: aadhaar update Village Ward Secretariats AP Govt

సంబంధిత కథనాలు

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ మార్చబోతోంది- మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ  మార్చబోతోంది-  మంత్రి గుడివాడ అమర్నాథ్

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం