Vemana Vs YS : వివాదాస్పదమవుతున్న యోగి వేమన విగ్రహం తొలగింపు - అంతకంటే ఉన్నత స్థానంలో పెట్టామన్న ప్రభుత్వం !
యోగి వేమన విగ్రహం తొలగింపుపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే అంత కంటే ఉన్నత స్థానంలో విగ్రహం పెట్టామని ప్రభుత్వం చెబుతోంది.
Vemana Vs YS : కడపలో యోగి వేమన యూనివర్శిటీలో యోగి వేమన విగ్రహం తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడం వివాదాసాప్దంఅవుతోంది. నిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. వైఎస్ విగ్రహం కావాలనుకుంటే యూనివర్శిటీలోని వేరే ప్రదేశంలో పెట్టుకోవచ్చని... వేమన విగ్రహాన్ని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ గేటు పక్కన ఉంచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 2006లో సీఎంగా ఉన్నప్పుడు యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
యోగి వేమనకు అవమానం
యోగి వేమన ఎన్నో ఆట వెలది పద్యాలు సమాజంలో నైతిక విలువలు మూఢనమ్మకాలు కుల వివక్ష వంటి వాటిపై జనంలో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి యోగివేమన. ఆయన గొప్పతనాన్ని చాటే విధంగా అప్పట్లో ప్రధాన పరిపాలన భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యోగి వేమన విగ్రహాన్ని తొలగించి.. వైఎస్ విగ్రహాన్ని పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశం అంత ని తండ్రి విగ్రహాలు పెట్టుకో ...కానీ ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని....టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో విగ్రహాలు,పేర్లు మార్పు పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
విగ్రహం తీసేసి గేటు దగ్గర పెట్టిన సిబ్బంది
ఆయన గొప్పతనాన్ని గుర్తించి అప్పట్లో దేశ ప్రధాని కార్యాలయం దగ్గర వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని ఆయన గుర్తు చేశారు. వేమన విశ్వవిద్యాలయ అధికారులు అత్యుత్సాహం తో వ్యవహరించి విగ్రహని తొలిగించి మరో చోటకు మార్చడం సిగ్గుచేటన్నారు. విగ్రహాల పాలన పోయి..ప్రజల సమస్యలు తీర్చే పాలన దగ్గరలో నే ఉందని..అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని శ్రీనివాస రెడ్డి గారు అన్నారు... ఎక్కడున్నా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని ..లేని పక్షం లో టీడీపీ తరపున ఆందోళలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం విగ్రహాలను మారుస్తున్నారు..కానీ ప్రజలు జగన్ ప్రభుత్వన్ని మార్చే రోజులు దగ్గరలో నే ఉందని హెచ్చరించారు.
ఉన్నతమైన స్థానంలో పెట్టామని సజ్జల వివరణ
మరో వైపు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. యోగి వేమన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అంతకంటే ఉన్నతమైన స్థానంలో పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే యోగి వేమన విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించలేదు. గేటు పక్కనే పెట్టారు. యూనివర్సిటీలకు పేర్లు మార్చడం.. విగ్రహాలు మార్చడం వంటి చర్యల వల్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా..వెనక్కి తగ్గడం లేదు. యోగి వేమనకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా విగ్రహాన్ని తొలగించడంపై సాహిత్య అభిమానుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చంద్రబాబు, పవన్‌లది స్క్రిప్ట్ రాజకీయం - ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్న సజ్జల !