అన్వేషించండి

Ramachandra Yadav: ఏపీలో ఆదివారమే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు - భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న రామచంద్ర యాదవ్ !

ఏపీలో ఆదివారం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. పుంగనూరు నేత రామచంద్ర యాదవ్ ..భారీ ఏర్పాట్ల మధ్య ప్రారంభిస్తున్నారు.

Ramachandra Yadav:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్‌ ప్రకటించారు. జూలై 23వ తేదీన అంటే ఈ ఆదివారం  కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.  గుంటూరు- విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతోనే పార్టీ పెడుతున్నా : రామచంద్ర యాదవ్

రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల వల్ల కేవలం 10 శాతం ప్రజలకే ప్రతిఫలం దక్కింది. మిగతా 90 శాతం ప్రజలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడగలిగారని రామచంద్ర యాదవ్ అంటన్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. ప్రజా సంపద కొందరి చేతిలోనే బంధీ అవుతుంది. ఇప్పటికే దౌర్జన్యాలు, దందాలు, ప్రజా సంపద దోపిడీతో రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతోందో మన కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.  ఈ పరిస్థితిని మార్చడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతో జూలై 23న కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందని రామచంద్రయాదవ్ చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామచంద్ర యాదవ్ 

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నేను పోటీ చేశారు.  అప్పుడు నేను రాజకీయాలకు కొత్త. అప్పటి పరిస్థితులు వేరు. అందువల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రజల కోసం ఎన్ని నిలబడ్డాయన్నదే ప్రధానం. వివిధ రకాల అజెండాలతో ఇప్పటి వరకు పలు పార్టీలు వచ్చి ఉండవచ్చు. పార్టీ నడపాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక, ధైర్యం, నిజాయితీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటు కమిట్‌మెంట్‌ ఇంకా ప్రధానం. అవన్నీ తనకు ఉన్నాయని రామచంద్ర యాదవ్ చెబుతున్నారు.  అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పర్యటించాను. అన్ని వర్గాల ప్రముఖులు, సామాన్యులతో మమేకమయ్యాను. వారందరి సూచనలు, సలహాలు.. నా విజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్టీ ఏర్పాటే సబబు అని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. మా పార్టీ విధానం ఏమిటనేది ఈ నెల 23వ తేదీన విస్పష్టంగా ప్రకటిస్తామని అంటున్నారు. 

రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నదెవరన్నదానిపై చర్చ !

ఓ వ్యాపారవేత్త అయిన రామచంద్ర యాదవ్ .. నేరుగా అమిత్ షాను కలిసి తనకు వై ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగారు. ఆయన కొత్త ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి రామ్ దేవ్ బాబా సహా చాలా మంది ప్రముఖులు వస్తారు. దీంతో ఆయన కొత్త పార్టీ వెనుక ఎవరు ఉన్నారన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం బడుగుల కోసమే పార్టీ పెడుతున్నానని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Elections 2024: 'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
OTT: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
Special Buses: హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
Akkineni Cousins : ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Warangal Public Reaction on Voting | ఓటు వేయటం ఎంత అవసరమో వరంగల్ ప్రజల మాటల్లో | ABP DesamCM Revanth Reddy Football in HCU | HCU లో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి | ABP DesamKadapa SP Siddharth Kaushal Mass Warning | EVMలు టచ్ చేయాలని చూస్తే..కడప ఎస్పీ వార్నింగ్ | ABPKarimnagar Youth Voters | ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో చెబుతున్న కరీంనగర్ ఓటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Elections 2024: 'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
'ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి' - అలా చేస్తే చర్యలు తప్పవని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వార్నింగ్
OTT: ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే' - తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎప్పుడంటే!
Special Buses: హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్
Akkineni Cousins : ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఒకే ఫ్రేమ్​లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
IPL 2024: చెపాక్‌ వేదికగా సీఎస్కేతో మ్యాచ్, బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
చెపాక్‌ వేదికగా సీఎస్కేతో మ్యాచ్, బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం
ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం
Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా
Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా
Sarkaar 4 Promo: ‘సర్కార్ 4’లో సత్యభామ - కాజల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుడిగాలి సుధీర్
‘సర్కార్ 4’లో సత్యభామ - కాజల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుడిగాలి సుధీర్
Embed widget