Kakinada News : అవతార్ సినిమా చూస్తూండగా గుండెపోటు - కాకినాడ జిల్లాలో వ్యక్తి మృతి !
కాకినాడ జిల్లా పెద్దాపురంలో అవతార్ సినిమా చూస్తూండగా వ్యక్తి మృతి చెందారు. అయితే ఆయన గుండె ఆగిపోవడానికి.. సినిమాలో వచ్చే దృశ్యాలు లేదా సౌండ్ కారణమని భావించడం లేదు.
Kakinada News : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అవతార్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ సినిమా చూస్తూ కాకినాడలో ఓ వ్యక్తి మరణించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన అవతార్ సినిమాను చూసేందుకు కట్టమూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీరెడ్డి శ్రీను, రాజు లు పెద్దాపురంలోని లలిత థియేటర్ లో వెళ్లారు. సినిమా మధ్యలో అన్న శ్రీను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అన్న పరిస్థితి గమనించిన తమ్ముడు రాజు వెంటనే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీను మృతితో కట్టమూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గుండెపోటు రావడానికి సినిమాలో సన్నివేశాలు కారణం కాదనే భావన
అయితే శ్రీనుకు గుండెపోటు రావడానికి సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ లేదా సౌండ్స్ కారణం కాదని భావిస్తున్నారు. ఈ సినిమా ధ్రిల్లింగ్‌గా ఉంటుంది కానీ.. భయపెట్టేలా ఉండదని.. గుండెపోటు తెప్పించే ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఉండవని చెబుతున్నారు. సాధారణంగా హారర్ సినిమాలు చూస్తున్న సమయంలో కొందరు గుండెపోటుకు గురవుతారు. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్-2’ సినిమాలో అటువంటి భయానక ఘటనలు ఏమీ ఉండహారతులు ఎక్కువయ్యే గడప గడపకూ వెళ్లలేకపోతున్నారట - ఎవరికీ తెలియని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఆవేదన ఇదేకపోయినప్పటికీ, ఆ విజువల్స్ చూస్తుంటే కొందరు అమితానందానికి, ఉద్వేగానికి గురవుతుంటారు.శ్రీనుకు ఇంతకు ముందు ఉన్న ఆరోగ్య సమస్యల వల్లే గుండె పోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అయితే సినిమా ధియేటర్‌లో చనిపోవడంతో ఈ అంశంపై హాట్ టాపిక్‌గా మారింది.
అవతార్ మొదటి భాగం వచ్చినప్పుడు తైవాన్‌లో సినిమా చూస్తూ ఒకరు మృతి
అవతార్ మొదటి భాగం సినిమా 2009 డిసెంబరులో విడుదలైన విషయం తెలిసిందే. అప్పట్లో తైవాన్ లోనూ 42 ఏళ్ల ఓ వ్యక్తి ఆ సినిమాను చూస్తూ థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడికి రక్తపోటు ఉందని అనంతరం తేలింది. అతడు సినిమా చూస్తూ బాగా ఉద్వేగానికి గురికావడంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో పెద్దాపురం శ్రీను వ్యక్తి మృతిని కొంతమంది పోలిక పెట్టి చూపిస్తున్నారు. అయితే శ్రీనుకు ఉన్న ఆరోగ్య సమస్యలపై ఇంకా పూర్తి సమాచారం బయటకు రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్న అవతార్ - 2
అవతార్ 2 మూవీ విడుదలైన ఒక్కరోజులోనే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ రాబట్టింది. మొదటిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా వైడ్‌గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.