Today Top Headlines: సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన - తెలంగాణ ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రేదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజక వర్గం కుప్పంపై దృష్టి సారించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సీఎం స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గు మళ్ళ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్,ప్రభుత్వ విప్, జి డి నెల్లూరు శాసనసభ్యులు డా.వి.ఎం. థామస్, పలమనేరు, చిత్తూరు,చంద్ర గిరి,నగరి, పూతల పట్టు శాసనసభ్యులు అమర నాథ్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఇంకా చదవండి.
2. కన్నీళ్లు పెట్టుకుంటూ నటి మాధవీలత వీడియో పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ నాయకురాలైన ఆమె తరచుగా వివాదాస్పద అంశాలతో వార్తలో నిలుస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సమాజంలో జరిగే ఇతర విషయాలపై కూడా రెస్పాండ్ అవుతూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొడుతుంది. అయితే రెండ్రోజుల క్రితం ఆమె జేసి ప్రభాకర్ రెడ్డిపై చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన కూడా మాధవీలతపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో, ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇంకా చదవండి.
3. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
తమ నెట్ వర్క్ మరింత విస్తరించేందుకు రైల్వే మరో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ను సోమవారం నాడు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చదవండి.
4. తెలంగాణ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా
తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ (Formula E Race) కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. ఇంకా చదవండి.
5. కేటీఆర్ ఏసీబీ విచారణ తీరుపై కవిత ఆగ్రహం
ఏసీబీ ఆఫీసు వద్ద కేటీఆర్ వాహనం అడ్డుకుని, లాయర్లను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై, తమ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇంకా చదవండి.