By: ABP Desam | Updated at : 07 Oct 2021 07:14 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 48,028 మంది నమూనాలు పరీక్షించగా 643 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 839 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు చనిపోగా.. గుంటూరు, విశాఖ, పశ్చిమ గొదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,86,12,576 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 07/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 7, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,52,411 పాజిటివ్ కేసు లకు గాను
*20,29,625 మంది డిశ్చార్జ్ కాగా
*14,236 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,550#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7E8FvVh6DI
కరోనా రెండో వేవ్ తర్వాత.. కొన్ని రోజులకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో థర్డ్ వేవ్ వస్తుందంటూ.. అంచనాలు వేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు థర్డ్ వేవ్ కు సంబంధించి.. వార్నింగ్ ఇచ్చేశారు. భారత్‌లో కొవిడ్ ముప్పు తొలగిపోలేదని.. మూడో ముప్పు ప్రభావం 103 శాతం వరకు ఉండొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పండగ సీజన్లలో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగితే కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనపత్రంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. పర్యాటకుల సంఖ్య పెరగటం.. సామాజిక.. రాజకీయ.. మతపరమైన అంశాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమి గూడుతున్నారని.. ఇవన్నీ మూడో వేవ్ కు కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ .. మనాలి.. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లలో కేసులు పెరుగుతున్న విషయాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.
ఈ నెల నుంచి కేసులు.. క్రమంగా పెరుగుతూ.. వచ్చే జనవరి-ఏప్రిల్ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. శాస్త్రవేత్తలు సందీప్ మండల్, నిమలన్ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్ పాండాలు రాసిన అధ్యయన పత్రం.. 'జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్'లో ప్రచురితమైంది. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని చెప్పారు.
Also Read : ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ తేదీలోగా ఆప్షన్లు ఇవ్వండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Cobra at Alipiri: అలిపిరి నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం - వెంటనే భక్తులు ఏం చేశారో తెలుసా !
Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
Tomato Price: టమోటా ధరలకు మళ్లీ రెక్కలు, సెంచరీ వైపు దూసుకెళ్లడంతో సామాన్యులు బెంబేలు
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ