Top Headlines: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ భయంతో పారిపోయారా? - తెలంగాణలో వెలుగుచూసిన కొత్త తరహా మోసం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ భయంతో పారిపోయారా?
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండుసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుకున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కకడే పట్టుకోవాలని చూస్తున్నారు. తమిళనాడులో ఉన్న ఆర్జీవీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా చదవండి.
2. ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా.?
అభివృద్ధి సంస్కరణలు ఎప్పుడూ ప్రభుత్వానికి కత్తి మీద సాములానే ఉంటాయి. ఒక్కోసారి ప్రజల్లో మంచి పేరు తెచ్చి పెడితే మరోసారి అదే తీవ్ర వ్యతిరేకతను రగులుస్తుంది. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ప్రయోగాన్ని చేపడుతోంది. అదే జిల్లా రోడ్లకు సైతం టోల్ టాక్స్ వర్తింపజేయాలనే ఆలోచన. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 18 రోడ్లను ఎంపిక చేసి టోల్ టాక్స్ ఆచరణలో పెట్టబోతుంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నేషనల్ హైవేలకు పిలిచినట్లుగానే ఏపీలోని జిల్లా రోడ్లకు సైతం టెండర్లు పిలిచి అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ఇంకా చదవండి.
3. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం
ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. నిర్మాణ రంగంలో ఉన్న మేస్త్రీలే టార్గెట్‌గా కేటుగాళ్లు పావులు కదుపుతున్నారు. భారీగా డబ్బులు ఆశ చూపించి పెట్టుబడి పెట్టించి ఉడాయిస్తున్నారు. కేటుగాళ్లు కొందరు తాపీ మేస్త్రీలతో మాట్లాడి వారిని గ్రూప్‌గా ఏర్పడి సొంత వ్యాపారం చేయమని ప్రోత్సహిస్తారు. భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా ఉపయోగించే పొక్లెయిన్ లాంటివి కొనుగోలు చేపిస్తున్నారు. తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం పొందవచ్చని వాళ్లకు నూరిపోస్తున్నారు. ఇంకా చదవండి.
4. ప్రతీ బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు
ఇప్పుడు, దాదాపు ప్రతి ఒక్కరి పేరిట ఏదోక బ్యాంక్ ఖాతా ఉంది. కాబట్టి, ఈ వార్త ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం, 25 నవంబర్ 2024) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సెషన్‌లో, బ్యాంకింగ్ రంగంలో నూతన మార్పులు తీసుకువచ్చే "బ్యాంకింగ్ సవరణ బిల్లు"ను (Banking Amendment Bill) ఆమోదింపజేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. బ్యాంక్ ఖాతా నామినీకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకింగ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత నయా రూల్స్ అమల్లోకి వస్తాయి. ఇంకా చదవండి.
5. ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియన్లను మట్టికరిపించింది. బ్యాటింగ్. బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు... కంగారులకు ఎక్కడా పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కంగారులను చిత్తూ చేస్తూ చిరస్మరణీయ విజయం సాధించింది. ఇంకా చదవండి.