AP Corona Cases: ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు.. నలుగురు మృతి
ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 246 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల వ్యవధిలో 28,855 కరోనా పరీక్షలు చేయగా.. 246 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,401కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 334 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,50,720 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,366 యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరులో 41, తూర్పుగోదావరిలో 80, గుంటూరులో 31, కడపలో 13, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 29, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కేసూ నమోదు అవ్వలేదు.
#COVIDUpdates: 08/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 8, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,65,592 పాజిటివ్ కేసు లకు గాను
*20,47,825 మంది డిశ్చార్జ్ కాగా
*14,401 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,366#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sfxUsiN3a4
భారత్ కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఓరోజు పెరిగిన కరోనా కేసులు, మరోరోజు తగ్గుతున్నాయి. కొవిడ్19 మరణాలలో సైతం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,451 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటి కేసులతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో 266 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. కరోనా మరణాలు నిన్నటితో పోల్చితే సగానికి పైగా తగ్గడం శుభపరిణామంగా కనిపిస్తోంది.
భారత్‌లో ప్రస్తుతం 1,42,826 (ఒక లక్షా 42 వేల 826) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత 262 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 13,204 మంది కరోనా మహమ్మారిని జయించారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.24 శాతానికి చేరింది. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.42 శాతం ఉంది. గత ఏడాది నుంచి ఇదే తక్కువ శాతం క్రీయాశీల కేసులు అని బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: India Corona Updates: దేశంలో కొత్తగా 11,451 కరోనా కేసులు, కానీ అదొక్కటే ఊరట
Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















