అన్వేషించండి

గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - ఇప్పుడు వారంతా బీసీలే

BC Caste: రాష్ట్రంలోని  పలు బీసీ ఉప కులాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించింది.

BC Caste: రాష్ట్రంలోని  పలు బీసీ ఉపకులాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించింది. ఉప కులాలు అన్నీ ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్ర మంతటా బీసీలుగానే పరిగణిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

వెనుకబడిన తరగతుల జాబితాలో 138 కులాలు ఉన్నాయి. వీటిలో 31 కులాలు వాటి కార్యక­లాపాలపై ప్రాంతం, భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో 10 బీసీ కులాలు తెలంగాణలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఆయా కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి పలు వినతులు వచ్చాయి. 

వాటన్నింటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రాష్ట్రమంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. 

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఇవే ఆ 21 కులాలు

భౌగోళిక పరిమితులు తొలగించిన వాటిలో బీసీ – ఏ గ్రూప్‌లో 6 కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. 

బీసీ – బీ గ్రూపులో 4 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. 

బీసీ – డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు ఉన్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
Embed widget