అన్వేషించండి

Top Headlines: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - తెలంగాణలో కొనసాగుతోన్న గ్రూప్ 2 పరీక్షలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In Ap And Telangana:

1. శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం

శ్రీశైలంలో (Srisailam) మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాట్ రోడ్డులోని డ్యామ్ సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చుని చిరుత (Cheetah) కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు యాత్రికులు రోడ్డుపై కూర్చున్న చిరుతను తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంకా చదవండి.

2. సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్

విజయవాడ (Vijayawada) శివారులోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్‌లో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక జనంలో నుంచి లేచి సీఎం చంద్రబాబుకు చేతులెత్తి అభివాదం చేస్తూ ఫోటో కావాలని అడిగింది. ఈ క్రమంలో ఆయన ఆమెను వేదికపై పిలిచి ఫోటో దిగారు. కాసేపు మాట్లాడి చదువు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఇంకా చదవండి.

3. ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

ఆడబిడ్డల రక్షణపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలను సంరక్షించడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆదివారం ఉదయం ప.గో జిల్లా పాలకొల్లులో 'సేవ్ ది గర్ల్ చైల్డ్' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' పేరుతో 2కె రన్ నిర్వహించారు. రాష్ట్రంలో యువత గంజాయికి బానిసవుతున్నారని అందుకు సినిమాలు సైతం ఓ కారణమని అన్నారు. కొందరు యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడమే హీరోయిజంలా భావిస్తున్నారని అన్నారు. ఇంకా చదవండి.

4. తెలంగాణలో కొనసాగుతోన్న గ్రూప్ - 2 పరీక్షలు

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి రోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. అయితే, నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. తామేం చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఇంకా చదవండి.

5. మెగాస్టార్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం అంతటా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు సంచలనం సృష్టించింది.‌ ఒక రాత్రి జైలులో హీరోని ఉంచడం చర్చనీయాంశం అయింది. జైలు నుంచి వచ్చిన బన్నీని చూడడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అల్లు వారింటికి క్యూ కట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే చిరంజీవి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వంభర' చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget