అన్వేషించండి

Andhra Corona Update: ఏపీలో కొత్తగా 1,623 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా మరో 8 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,623 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 65,596 మంది నమూనాలు పరీక్షించగా 1,623 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

 

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది.  బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 10 మంది కరోనా బారిన పడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణ అయ్యింది. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు ఉంది. అప్రమత్తమైన అధికారులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏవై 12

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినట్లే కనిపిస్తున్నా... థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. కరోనా మహమ్మారి రోజుకో రూపంతో వైద్యరంగానికి సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకూ డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు ప్రమాదకరం అనుకుంటే తాజాగా డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో రకం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏవై.12  వేరియంట్ తొలి కేసు ఆగస్టు 30న ఉత్తరాఖండ్‌లో నమోదైంది. వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఏవై.12 కేసులు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 178 నమోదయ్యాయి. ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు వచ్చాయి. ఈ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.


దేశంలో పలు రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినప్పుడు డెల్టా పస్ల్ ఏవై.12 కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాల నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపి, వైరస్‌ వేరియంట్లను గుర్తిస్తున్నారు. ఈ పరిశోధనలో డెల్టా ప్లస్‌ వేరియంట్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోయి మోనోక్లోనల్‌ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget