News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rains In Telangana & AP: మరో రెండ్రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీ వ్యాప్తంగా ఇలా!

Rains In Telangana & AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

FOLLOW US: 
Share:

Rains In Telangana & AP: ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం వాయువ్యవ దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా నేడు బలపడనుంది. అనంతరం ఉత్తర బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. నేడు, రేపు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..

ఈ ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు.. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

Published at : 20 Aug 2022 05:16 AM (IST) Tags: AP Rains Telangana Weather Report Rains in Telangana AP Weather Report Weather Report

ఇవి కూడా చూడండి

Cyclone Michaung: అల్పపీడనంగా మారిన మిచౌంగ్‌ తుఫాన్, ఏపీలో 40 లక్షల మందిపై ప్రభావం

Cyclone Michaung: అల్పపీడనంగా మారిన మిచౌంగ్‌ తుఫాన్, ఏపీలో 40 లక్షల మందిపై ప్రభావం

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect On Telangana: తెలంగాణపై మిగ్‌జాం ప్రభావం- రికార్డుస్థాయిలో వర్షాలు- నేడూ జల్లులు

Michaung Cyclone Effect On Telangana: తెలంగాణపై మిగ్‌జాం ప్రభావం- రికార్డుస్థాయిలో వర్షాలు- నేడూ జల్లులు

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclone Michaung News: రవాణా వ్యవస్థపై మిగ్‌జాం ఎఫెక్ట్‌- విమానాలు, రైళ్లు రద్దు

Cyclone Michaung News: రవాణా వ్యవస్థపై మిగ్‌జాం ఎఫెక్ట్‌- విమానాలు, రైళ్లు రద్దు

టాప్ స్టోరీస్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా