రూ. 200లతో లక్షలు సంపాదించేందుకు శిక్షణ- చదువుతో సంబంధం లేదు
సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకున్న రైతులకు దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు శిక్షణ ఇస్తున్నాయి. ఆసక్తి ఉన్న వ్యవసాయదారులు తమకు దగ్గరలో ఉన్న కేవీకేలను సంప్రదించవచ్చు.
సేంద్రీయ వ్యవసాయం.. రోజురోజుకూ ప్రజాదరణ పొందుతున్న విధానం. ప్రస్తుతం దేశంలో సేంద్రీయ సాగు ద్వారా ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ అందులో ఇంకా ప్రాథమిక విషయాలు తెలియని కర్షకులూ ఉన్నారు. సేంద్రీయ సాగు చేయాలని ఉన్నా.. ఎలా మొదలుపెట్టాలో తెలియక వెనకడుగు వేస్తున్నవారు లేకపోలేదు.
అయితే ఇప్పుడు అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కృషి విజ్ఞాన కేంద్రాలు వారి సమస్యను తీరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేవీకేలు సేంద్రీయ సాగు పద్ధతులపై వ్యవసాయదారులకు శిక్షణ ఇస్తున్నాయి. ఆసక్తి ఉన్న రైతులు తమ సమీప కేవీకేతో సంప్రదింపులు జరపవచ్చు.
సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి
కృత్రిమ ఇన్ పుట్స్ (ఎరువులు, పురుగుమందులు, హార్మోన్లు, ఫీడ్ ఎడిసివ్ లు మొదలైనవి) వాడకాన్ని తగ్గించి.. పూర్తిగా ప్రకృతిలో లభించే వాటితో సాగు చేయడమే సేంద్రీయ వ్యవసాయమని.. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్వచించింది. పంట మార్పిడిలు, పంట అవశేషాలు, జంతు ఎరువులు, ఆఫ్-ఫార్మ్ సేంద్రీయ వ్యర్థాలతో ఈ సాగు చేస్తారు.
సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్న కేవీకే మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కేవీకే కనేరి రైతులకు చాలా నామమాత్రపు ధరకు శిక్షణ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయాన్ని సులభంగా ప్రారంభించి, దాని ద్వారా మంచి ఆదాయాన్ని ఎలా సంపాదించవచ్చో నిపుణులు చెబుతారు. శిక్షణలో రోజువారీ క్లాసులు, ఫీల్డ్ డెమానిస్ట్రేషన్ మొదలైనవి ఉంటాయి.
శిక్షణ కోసం దరఖాస్తు ఇలా
సేంద్రీయ సాగు శిక్షణపై ఆసక్తి ఉన్న రైతులు కేవీకే సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ఫారం నింపాలి. ప్రవేశ రుసుము రూ. 200 ఉంటుంది. లావాదేవీ వివరాలను ఫారంలో నింపి డిపాజిట్ చేయాలి.
బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
ఖాతా పేరు : శ్రీ సిద్ధగిరి మత్
ఖాతా నంబరు : 38316771849
ఐఎఫ్ ఎస్ సీ కోడ్: SBIN0007958
సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు
సేంద్రీయ సాగు యొక్క ముఖ్యమైన ప్రయోజనం ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులు పొందుతారు. పురుగుమందులు, ఎరువుల అవశేషాలు లేకుండా సాగు చేసిన వాటిని అందించవచ్చు. అలాగే రైతు పెట్టుబడిపై మంచి రాబడి పొందుతాడు.