News
News
X

టొమోటో రైతులు, వినియోగదారులకు గుడ్ న్యూస్- ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు

దాదాపు 20 వేల మంది టొమాటో రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ. (Farmer Producer Organizations)లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డెవలెప్మెంట్ జరుగనుంది.

FOLLOW US: 
 

దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ కొత్త ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి నేతృత్వంలో ప్రక్రియ పూర్తైంది. దాదాపు 20 వేల మంది టొమాటో రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ. (Farmer Producer Organizations)లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డెవలెప్మెంట్ జరుగనుంది.
                                                          
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే టొమాటో రైతుల సంక్షేమానికై జగనన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని తెలిపారు. మార్కెట్, దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించి.. వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్ కు చర్యలు చేపట్టిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్...

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్ కింద టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు కాకాణి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జగనన్న ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏర్పాటు చేసిందన్నారు. సాధారణంగా డిమాండు, సప్లైకి అనుగుణంగా టొమాటో ధరలో హెచ్చుతగ్గులు ఉందడం వల్ల వినియోగదారులపై, రైతులకు భారంగా ఉంటుందని వివరించారు. టొమాటో ధరలు అధికంగా ఉన్నప్పుడు వినియోగదారులకు ఉపశమాన్ని కల్పించేందుకు, ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తుందని పేర్కొన్నారు. 

News Reels

ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడటం వల్ల డిమాండుకు మించి దిగుబడి రావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు కాకాణి. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్ కు చర్యలు చేపట్టామని వివరించారు. ఆంద్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ , లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్‌తో నేడు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.110 కోట్ల అంచనా వ్యయంతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు కాకాణీ. వీటిలో 4 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తయినాయని, వచ్చే నెల్లో వాటిని ప్రారంభించడానికి చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యతను ఎఫ్.పి.ఓ. లకు అప్పగించామన్నారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర ప్రాసెసింగ్ ప్రక్రియకు వంటి కెపాసిటీ బిల్డింగ్ పనులకు ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ సహకరిస్తుందని వెల్లడించారు. మార్కెటింగ్ చైన్ అభివృద్దికి లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్ సహకరిస్తుందన్నారు. అందరి భాగస్వామ్యంతో టొమాటో రైతులను అన్ని విధాలుగా ఆదుకొనేందుకు, కనీస మద్దతు ధరను కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించి పూర్తి స్థాయిలో టొమాటో రైతులకు లబ్దిచేకూర్చాలనే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం ఈ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు.

Published at : 22 Nov 2022 05:13 AM (IST) Tags: YS Jagan Agriculture News Vijayawada News Farmer Producer Organizations

సంబంధిత కథనాలు

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

తుపాను ప్రభావిత జిల్లాపై ప్రభుత్వం ఫోకస్- రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు

తుపాను ప్రభావిత జిల్లాపై ప్రభుత్వం ఫోకస్- రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలు

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్