Wheat Grass: వీట్ గ్రాస్ ని ఇంట్లోనే ఇలా సులువుగా పెంచుకోవచ్చు!
Wheat Grass: వీట్ గ్రాస్, గోధుమ గడ్డి.. డైట్ ఫాలో అయ్యేవాళ్లు రోజూ తీసుకునే ఆహారంలో ఇదొకటి. మనిషిని ఆరోగ్యంగా ఉంచే ఈ గడ్డి చాలా ఖరీదైంది. రోజూ కొనలేని వారు దీన్ని సులువుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
Wheat Grass: డైట్ ఫాలో అయ్యే వారికి వీట్ గ్రాస్ గురించి చాలా బాగా తెలుసు. దానిలో ఉండే పోషక విలువలు ఎంతో బలాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వీట్ గ్రాస్ ని కాల్చుకొని తింటుంటారు. అంతే కాదండోయ్ గోధుమ గడ్డి రసం చాలా ఖరీదుతో కూడుకున్నది. రోజూ తినాలకను వాళ్లు అంత ఎక్కువ డబ్బు పెట్టే బదులుగా చక్కగా ఇంట్లోనే ఈ గోధమ గడ్డిని పెంచుకోవచ్చు. అయితే దీనిని ఎలా పెంచుకోవాలి, దీని వల్ల కల్గే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ గడ్డిలో ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బరువును తగ్గడంలో కూడా ఇది చాలా బాగా సహాయ పడుతుంది. వీట్ గ్రాస్‌లో కాలేయ నిర్విషీకరణ మరియు రోగ నిరోధక వ్యవస్థ మెరుగుదల వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గోధుమ గడ్డి విటమిన్లు ఏ, సీ మరియు ఈ అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, అమినో యాసిడ్‌లకు అధికంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపే వాళ్లంతా ఈ గోధుమ గడ్డి రసాన్ని తాగుతారు.
ఇంట్లో గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలి..?
ఇంట్లో గోధుమ గడ్డిని పెంచుకోవాలనుకునే వాళ్లు మొదటగా ఒక గిన్నె లేదా కూజా తీస్కోవాలి. గడ్డిని పెంచుకునేందుకు ఒక కప్పు గోధముల పక్కన పెట్టుకోవాలి. ఇవి మొలకెత్తేందుకు వీటిలో నీళ్లు కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ కూజాకి ప్లాస్టిక్ మూత పెట్టాలి. కనీసం ఆరు గంటలు లేదా రాత్రిపూట ఈ విత్తనాలను నానబెట్టుకోవాలి. ఆ తరువాతఈ గింజలు పూర్తిగా నీటిని పీల్చుకుంటాయి. ప్రతిరోజూ కనీసం రెండుసార్లు మరియు మూడు సార్లు, ఆ నీటిని తీసేసి కొత్త నీళ్లు పోస్తూ ఉండాలి. రెండు మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమవుతుంది.
ఇంట్లో గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలి?
ఒక ట్రేలో అర అంగుళం లేదా అంతకంటే కాస్త ఎక్కువ ఎత్తులో మట్టి పోస్కోవాలి. దీనిపై కొంచెం నీటిని తీస్కొని స్ప్రే చేస్తే మరింత మంచిది. ఆ తర్వాత ఈ మట్టిపై మొలకెత్తిన విత్తనాలను నేలపై చల్లడం మంచిది. ఆ తర్వాత విత్తనాలపై కాస్త దూది కప్పాలి. ట్రేని కాస్త పొడి ప్రదేశంలో కొద్దిగా వెలుతూరు వచ్చేలా ఉంచండి. ఇలా చేయడం వల్ల మంచిగా మొలుస్తుంది. సులువుగా ఇంట్లోనే ఇలా గోధుమ గడ్డి పెంచుకొని ఆరోగ్యం కాపాడుకోండి.
గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిణామంలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తల నొప్పి, జీర్ణకోశ వ్యాధులు, పళ్ల రంగు మారడం, మగతగా ఉండడం జరుగుతుంది. గోధుమ రసాన్ని తాజాగానే, వెంటనే వాడాలి. నిలువ చేసి తీస్కోవడం అంత మంచిది కాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు. ఎవరికైతే గోధుమ రసం పడదో, వారు మానివేయడం మంచిది. డాక్టర్ లేదా న్యూట్రిషియన్ ఎక్స్ పర్ట్స్ లేదా పౌష్టికాహార నిపు ణుని సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి.