అన్వేషించండి

తెలంగాణలో పత్తి కొనుగోలుకు సర్వం సిద్ధం- ధర పడిపోయినా రైతులు నష్టపోకుండా చర్యలు

కాటన్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోళ్లకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 350పైగా కేంద్రాలను రెడీ చేసింది.

తెలంగాణలో పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధమయ్యారు. నవంబర్‌ మొదటి వారంలో కొనుగోళ్లు జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ధర విషయంలో మాత్రం రైతులు అసంతృప్తితో ఉన్నారు. 

కాటన్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోళ్లకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 350పైగా కేంద్రాలను రెడీ చేసింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సరకుతో వచ్చిన రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. 

అన్ని ఏర్పాట్లు సవ్యంగా సాగుతున్నప్పటికీ ధర విషయంలో మాత్రం రైతులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం క్వంటా ధర 7వేల రూపాయలుగా ఉంది. ఈ రేటు రావాలంటే 8 శాతం మాత్రమే తే ఉండాలని అధికారులు చెబుతున్నారు. అయితే అంతకు మించి తేమ ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు భారీగా ధర చెల్లిస్తున్నారు. 15 శాతానికి పైగా తేమ ఉన్న సరకుకే ప్రైవేటు వ్యాపారులు దాదాపు ఏడు వేల వరకు ఇస్తున్నారు. ఈ లెక్క ప్రకారమైతే 8 శాతం ఉన్న పత్తికి ఏడు వేల ఐదు వందల వరకు ఇవ్వాలనే డిమాండ్ ఉండనే ఉంది. 

ఇప్పుడిప్పుడే రాష్ట్రవ్యాప్తంగా పత్తి కోత మొదలైంది. రాబోయే వారం పదిరోజుల్లో మరింత ఊపందుకోనుంది. దీంతో మార్కెట్‌లో ధర పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేస్తున్న అధికారులు ఆ దిశగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బహిరంగ మార్కెట్‌లో ధర పడిపోయినా తాము రైతులు నష్టపోకుండా ధర చెల్లిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయింది. అంటే దాదాపు 40 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget