PM Modi Portrait: ఆహార ధాన్యాలతో మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు... 8 అడుగుల చిత్రం... 20 గంటల సమయం
ఒడిశాకు చెందిన ప్రియాంక సహాని ఆహార ధాన్యాలు ఉపయోగించి 8 అడుగుల నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపొందించింది.
71వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు చోట్ల మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అభిమానులు, కార్యకర్తలు.
Also Read: Narendra Modi Pagdi: బర్త్ డే స్పెషల్... ప్రధాని మోదీ తలపాగాల ప్రత్యేకత
ఇదిలా ఉంటే... మరికొందరు ఔత్సాహికులు తమకు నచ్చిన రీతిలో మోదీకి విషెస్ చెబుతున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ 2035 సముద్రపు గవ్వలు ఉపయోగించి పూరీ తీరాన ప్రధాని నరేంద్ర మోదీ సైకత శిల్పాన్ని రూపొందించి విషెస్ చెప్పాడు. ఇప్పుడు ఒడిశాకు చెందిన ప్రియాంక సహాని ఆహార ధాన్యాలు ఉపయోగించి 8 అడుగుల నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపొందించింది.
Odisha | Artist Priyanka Sahani creates 8 ft-long portrait of PM Narendra Modi using food grains, on his 71st birthday
— ANI (@ANI) September 17, 2021
"India's an agricultural country, so I made this portrait using food grains to pay respects to PM. It also reflects Odisha's tradition of Pattachitra," she says pic.twitter.com/dZhMFpIcfR
ఈ సందర్భంగా ప్రియాంక ANIతో మాట్లాడుతూ... ‘ఈ పెయింటింగగ్ వేయడం చాలా కష్టం. 5 రకాల ఆహార ధాన్యాలు ఉపయోగించి ఈ చిత్రం వేశాను. సుమారు 20 నుంచి 25 గంటల సమయం పట్టింది ఈ బొమ్మ వేయడానికి. ఆహార ధాన్యాలే ఎందుకు ఎంచుకున్నానంటే... భారత్... వ్యవసాయ ఆధారిత దేశం. అందుకే నేను ఆహార ధాన్యాలు ఎంచుకుని మోదీపై గౌరవంతో ఇలా చేశాను. అంతేకాదు, ఇది ఒడిశా ట్రెడిషన్ పట్టచిత్రని రిప్లెక్ట్ చేస్తుంది’ అని ప్రియాంక తెలిపింది. ప్రియాంక ఈ ఆర్ట్‌ని ఆమె తండ్రి బిబేకనంద సహాని నుంచి నేర్చుకుందట.
Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India.
— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021
I’ve created a SandArt installation used 2035 sea shells with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha . pic.twitter.com/uDTJGOLCFk
1950, సెప్టెంబరు 17 నరేంద్ర మోదీ గుజరాత్‌లో జన్మించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భాజపా నేతలు, అభిమానులు, సినీ, క్రీడా ప్రముఖులు మోదీకి సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలిపారు.