PM Modi Birthday: సముద్రపు గవ్వలతో ప్రధాని మోదీ సైకత శిల్పం... పూరీ బీచ్ తీరాన రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ తీరాన ప్రధాని మోదీ సైకత శిల్పాన్ని రూపొందించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (17-09-2021) 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోదీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ తీరాన ప్రధాని మోదీ సైకత శిల్పాన్ని రూపొందించాడు. అనంతరం ఈ సైకత శిల్పానికి చెందిన ఫొటోని ట్విటర్ ద్వారా మోదీతో పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథ స్వామి దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఆయురారోగ్యాలతో ఉండాలి.’ అంటూ సుదర్శన్ మోదీకి బర్త్ డే విషెస్ చెప్పాడు.
Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India.
— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021
I’ve created a SandArt installation used 2035 sea shells with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha . pic.twitter.com/uDTJGOLCFk
ఇంతకీ సుదర్శన్ పట్నాయక్... మోదీ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దాడో తెలుసా? 2035 సముద్రపు గవ్వలను మోదీ సైకత శిల్పంపై అలంకరించాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడు పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటో పెద్ద సంఖ్యలో లైక్‌లు దక్కాయి. ఈ సైకత శిల్పం చాలా బాగుందని నెటిజన్లు సుదర్శన్ పట్నాయక్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Narendra Modi Pagdi: బర్త్ డే స్పెషల్... ప్రధాని మోదీ తలపాగాల ప్రత్యేకత
#HappyBirthdayModiji.
— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021
I’ve used sea shells in my sandart installation at Puri beach in Odisha wishing Hon’ble Prime Minister on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India. pic.twitter.com/TtGr6v9Wu6
This is so amazing !! Love the shells used as decorations!!👏👏👏👏👏👏
— Sun.beam🇮🇳🌺💫 (@SatChitAnand_) September 17, 2021