Karimnagar Collector: 'యాసంగి సీజన్ లో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి'
యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్ అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో యాసంగి సీజన్ లో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్ లో రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎఫ్ .సి .ఐ ద్వారా కొనడం లేదని అన్నారు. అందువల్ల యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. ఈ యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.





















