Cyber Crime: మీరు ఇన్ స్టాలో ఉన్నారా..మీకు న్యూడ్ కాల్స్ రావొచ్చు.. ఇలా మోసపోవచ్చు
మీరు ఇన్ స్టాలో ఉన్నారా.. అయితే జాగ్రత్త. సైబర్ అటాక్స్ పెరిగిపోయాయి. ఎప్పుడు ఎవరు ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. మీ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు లాక్కొవచ్చు. తాజాగా ఇన్ స్టాలో ఫిషింగ్ క్రైమ్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇన్ స్టాలో మీకు కాల్ చేస్తారు. పొరపాటున మీ ఫేస్ వాళ్ల ఫోన్ లో రికార్డు అయితే అంతే సంగతులు.. రకరకలుగా మీ ఫేస్ ని వాడేస్తారు. పోర్న్ వీడియోలో మీ ఫేస్ ని సెట్ చేసి మీ దగ్గర డబ్బులు లాగే స్కెచ్ వేస్తారు. హర్యానా, యూపి, రాజస్థాన్‌ల నుంచి ఈ దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నారు. భరత్‌పూర్, మథుర, మేవాట్ వంటి ప్రాంతలను కేంద్రంగా చేసుకుని సైబర్ దాడులు చేస్తున్నారు. అయితే వాళ్లు ఏ నెంబర్ నుంచి.. సైబర్ క్రైమ్ చేస్తారని.. తెలియదుగాని.. ఈ ప్రాంతాల్లో ఫ్రీక్వెన్నీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















