(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Emotional | RR vs RCB Highlights| అభిషేక్ శర్మ తరువాత ఎక్కువ సిక్సులు కొట్టింది కోహ్లీనే
కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో.. ఏ కారణాల వల్ల ఆర్సీబీ ఓడిపోయిందో అన్న లెక్కలు వేసుకుంటున్న వేళ.. అందరు చూపు విరాట్ కోహ్లీపై పడుతుంది. అతడి వల్ల ఓడిపోయిందని కాదు.. అతడు కూడా లేకుంటే ఆర్సీబీ పరిస్థితి ఇంకా దిగజారేది కదా అన్నట్లుగా..! ఎందుకంటే..
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోవడాన్ని యంగ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, సీనియర్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం కొత్తగా ఏం జరిగింది. నాకౌట్ మ్యాచుల్లో చోక్ అవడం ఆర్సీబీకి కొత్తేం కాదే అన్నట్లుగా పోస్టులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్సీబీ మొత్తం 14 ప్లే ఆఫ్స్ మ్యాచులు ఆడగా అందులో 5 మాత్రమే గెలిచింది. 2009లో ఫస్ట్ టైమ్ ప్లే ఆఫ్స్ కు వచ్చిన ఆర్సీబీ ఫైనల్ లో ఓడిపోయింది. 2010లో ప్లే ఆఫ్స్ లో ఓడిపోయింది. 2011లోనూ ఫైనల్ కు వచ్చిన కప్ కొట్టలేకపోయింది. ఇక..2015లో క్వాలిఫైయర్ -2లో ఆర్ఆర్ చేతిలో ఓడిపోయింది. 2016లో ఫైనల్ కు వచ్చినప్పటికీ SRH చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత మళ్లీ 2020లో ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. 2020,2021లో నూ ఎలిమినేటర్స్ లో ఓడిపోయింది. 2022లో ఎలిమినేటర్స్ లో గెలిచి..వెంటనే క్వాలిఫైయర్ 2లో ఓడిపోయింది. ఇక.. నిన్న కూడా ఎలిమినేటర్స్ లో ఆర్ఆర్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఇలా.. 9సీజన్లలో ప్లే ఆఫ్స్ లో కి వచ్చినప్పటికీ.. ఒక్కసారి కూడా కప్ కొట్టలేని చరిత్ర ఆర్సీబీ దే. మకుటం లేని మహారాజు అంటే ఆర్సీబీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. ఒక్క కప్ లేకపోయినా ఆర్సీబీ ఇచ్చే ఎంటర్మెన్మెంట్ అంతా ఇంతా కాదు. చెన్నై, ముంబయి తరువాత ఎక్కువ మంది ఫ్యాన్స్, బ్రాండింగ్ ఉన్న టీమ్ ఇదే. దీంతో... కప్ లేకపోవడం వల్లే ఆర్సీబీ బ్రాండింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ సాల కప్ నమ్‌దే అన్న ట్యాగ్ లైన్ ఆర్సీబీని ఇప్పట్లో వదిలేలా లేదు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.