Suryakumar Yadav Surgery | సూర్యకుమార్ కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియాకు విజయవంతంగా సర్జరీ చేశారు డాక్టర్లు. ఇందుకు సంబంధించి సూర్య కుమార్ సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా పెట్టారు. సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్లో హాస్పిటల్ లో సర్జరీ తర్వాత దిగిన ఫోటోను షేర్ చేస్తూ లైఫ్ అప్‌డేట్ అని రాసుకొచ్చారు.
స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ పూర్తయిందని .... సర్జరీ సక్సెస్ అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు తాను కోలుకుంటున్నానని... క్రికెట్ స్టేడయింలోకి తిరిగి రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తున్నానంటూ చెప్పుకొచ్చారు సూర్య కుమార్.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు పూర్తయింది. దీని తర్వాత టీమిండియా ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది, ఆ తర్వాత టీ20 సిరీస్ ఆడుతుంది. కానీ సూర్య కుమార్ యాదవ్ ఈ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల వరకు సమయం పడుతుంది. పూర్తి ఆరోగ్యంతో సూర్య మళ్లీ బ్యాట్ పట్టాలంటే మూడు నెలలు టైం పట్టేలా ఉంది.




















