Suryakumar About India Defeat | ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్
నాలుగవ టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది. శివమ్ దూబేకు ( Shivam Dubey ) తోడుగా మరో బ్యాటర్ రాణించి ఉంటె ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని అన్నారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) అన్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు నాలుగో మ్యాచ్ లో ఓటమి తప్పలేదు.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్, ఓటమికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ టీమ్ లో ఉన్న అందరు ప్లేయర్స్ ను ఆడించాలనే ఉద్దేశంతోనే ఇతర ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు.
'ఈ మ్యాచ్‌లో మేం కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం. మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకున్నాం. 180-200 పరుగుల లక్ష్య చేధనలో ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇది మాకు ఓ గుణపాఠం. ప్రపంచకప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఇతర ఆటగాళ్లను ఆడించలేదు.
మేం ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం. ఛేజింగ్‌లో మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవాలనుకున్నాం. అందుకే టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకున్నా అని అన్నాడు సూర్యకుమార్ యాదవ్.





















