Sports Psychologist Warning to Vaibhav | వైభవ్‌పై మైండ్ గేమ్‌పై సైకాలజిస్ట్ కామెంట్స్
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నడుస్తోంది. మైదానంలో అతని అగ్రెసివ్ ఇమేజ్ చూసి, అపోజిషన్ టీమ్స్ స్లెడ్జింగ్ మరియు మైండ్ గేమ్‌తో టార్గెట్ చేస్తున్నాయి. ఇటీవల శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచ్‌లో లంక ప్లేయర్స్ రెచ్చగొట్టడంతో వైభవ్ తీవ్ర కోపానికి గురయ్యాడు.
ఈ హాట్ ఇష్యూపై ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సేవనూర్ స్పందించారు. వైభవ్‌కు ప్రస్తుతం మైండ్ కంట్రోల్ మరియు సిట్యుయేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చాలా అవసరమని చెప్పారు. గతంలో NCA క్యాంప్‌లో వైభవ్‌తో వర్క్ చేసిన సేవనూర్.. తను నిజానికి చాలా కామ్ బాయ్ అని, కానీ సీనియర్ లెవెల్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్‌తో పాటు సిట్యుయేషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని సూచించారు. క్రికెట్ అనేది 90 శాతం మెంటల్ గేమ్, కాబట్టి ప్రెజర్‌ను రొటీన్‌లో భాగంగా మార్చుకోవాలన్నారు.
మరోవైపు టీమిండియా ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉండటంతో కొందరు యంగ్ ప్లేయర్స్ రికార్డుల కోసం హడావుడి పడుతూ యాంగ్జయిటీకి లోనవుతున్నారని ఒక మాజీ సెలెక్టర్ పేర్కొన్నారు. బీసీసీఐ వీరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి, "మేము ఉన్నాం" అనే నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు






















