రెజ్లర్లు ఏం తినరు, వెయిట్ లాస్ అనేది ఓ టార్చర్ - పుల్లెల గోపీచంద్
ABP Southern Rising Summit 2024 Hyderabad: పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అంతర్జాతీయ కోచ్. 2001లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచారు. ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా పుల్లెల గోపీచంద్ నిల్చారు. 1980లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె మాత్రమే సాధించారు. పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand Full Speech) సాధించిన ఈ అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారం ఆయన్ను వరించింది. 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. 2005లో భారత ప్రభుత్వం పుల్లెల గోపీచంద్‌కు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గోపీచంద్ ఓ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు. జూలై 29, 2009న గోపీచంద్ కు ద్రోణాచార్య పురస్కారం.. 2014లో పద్మభూషణ్ అవార్డు కూడా గోపీచంద్ కు వచ్చింది.