Who is Responsible for Bangalore RCB Stampede | బెంగుళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP Desam
18ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ ను ముద్దాడిందన్న ఆనందం ఒక్క పూట కూడా మిగలేదు ఆర్సీబీ ఆటగాళ్లకు. విరాట్ కొహ్లీ దగ్గర నుంచి జట్టులో చివరాఖరి ఆటగాడి వరకూ తమ ఆనందాన్ని బాహాటంగా పంచుకోలేని పరిస్థితికి తీసుకువచ్చేశారు. బెంగుళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట 11మంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవటమే కాదు 33మంది జీవితాలను కకావికలం చేసింది. అసలు ఈ ఘోర తప్పిదానికి కారణం ఎవరు..? ఆర్సీబీ ఫ్యాన్ బేస్ తెలియని రాజకీయ నాయకుల ప్రచార యావదా..ప్రమాదం జరిగిందని తెలిసినా సన్మాన కార్యక్రమాలు కొనసాగించిన ఆర్సీబీ యాజమాన్యానిదా..తమకేం తెలియదు తప్పంతా అక్కడి ప్రభుత్వానిదే అని తోసేస్తున్న బీసీసీఐదా..పదకొండు మంది ప్రాణాలు పోవటానికి రెస్పాన్స్ బుల్ ఎవరు ఇప్పుడు ఇదే ప్రశ్న కర్ణాటక ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. అసలు ఏం జరిగింది..బెంగుళూరు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత నాయకులు ఎలా మాట మారుస్తున్నారు..క్రికెట్ బోర్డులు ఎలా సైడ్ అయిపోతున్నాయి...వివరంగా చూద్దాం. ఆర్సీబీ 18ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. విరాట్ కొహ్లీ అండ్ ఫ్యాన్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. క్రికెట్ పోరాట యోధుడి జీవితంలో అపురూపమైన క్షణాలు ఇవి. గ్రౌండ్ లో మోకాళ్ల మీద పడి తను కన్నీళ్లు పెట్టుకున్న విధానం చూసైనా చెప్పొచ్చు ఇది ఎంత స్పెషల్ మూమెంటో కోహ్లీకి. ఆర్సీబీ మ్యాచ్ అయిన తర్వాత కోహ్లీ మాట్లాడేప్పుడు రేపు బెంగుళూరులో విక్టరీ పరేడ్ కోసం ఎదురుచూస్తున్నానని..18ఏళ్లుగా ఈ కప్ కోసం ఎదురు చూస్తున్న బెంగుళూరు అభిమానుల మధ్యలో తన సంతోషాన్ని పంచుకోవాలనుందని అన్నాడు. అంటే అప్పటికే కోహ్లీకి బెంగుళూరులో విక్టరీ పరేడ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎవరిస్తారు ఆబ్ వియస్ లో ఆర్సీబీ జట్టు యాజమాన్యం చెబుతుంది. కాబట్టే తనకు ఉన్న సమాచారాన్ని చెప్పాడు.





















