Virat Kohli Speech After RCB Win IPL 2025 | ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రసంగం
18ఏళ్ల పోరాటాన్ని, కలను సాకారం చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. ఎన్నో పోరాటాలు అంతకు మించిన కన్నీళ్లు..హార్ట్ బ్రేక్ అయిన ప్రతీసారి మళ్లీ కొత్త ఉత్సాహంతో అంతు చిక్కని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగటం కోసం కప్పు కోసం ట్రై చేయటం..18ఏళ్లుగా చేస్తూ పోయిన ఈ నిరంతర ప్రక్రియ గురించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ సాధించిన తర్వాత మాట్లాడాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ జట్టులోనే తన యవ్వనమంతా గడిచిపోయిందన్నాడు విరాట్ కోహ్లీ. 2008లో చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు ఆర్సీబీలో అడుగుపెట్టానని అప్పటి నుంచి కప్పు కొట్టాలనే కలను కంటూనే ఉన్నానని..ఈ ప్రాసెస్ లోనే తన యంగ్ ఏజ్ మొత్తం ఆర్సీబీలోనే అయిపోయిందని..తన ప్రైమ్ స్టేజ్ ను ఆర్సీబీ చూసిందని..అలాంటి ఇక ఇప్పుడు కెరీర్ చివరి భాగానికి వచ్చే సరికి దక్కిన ఈ విజయం ఈ ఫలితం మర్చిపోలేది అన్నాడు విరాట్ కోహ్లీ. ఈరోజును ఈ క్షణాన్ని తన జీవితంలో మర్చిపోలేన్న విరాట్ కోహ్లీ బెంగుళూరుకు వెళ్లి అక్కడ అభిమానుల మధ్యలో ఈ గెలుపు సంబరాలు చేసుకోవటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. 18ఏళ్లుగా తనకు, ఆర్సీబీకి అండగా ఉన్న అభిమానులను వాళ్ల ప్రేమను మర్చిపోలేన్న కోహ్లీ.. అన్నింటినీ మించి ఈ రోజు చంటి పిల్లాడిలా నిద్రపోతానని చెప్పాడు. ఇన్నాళ్లుగా ఈ కప్పు లేని లోటు తనకు సరైన నిద్ర లేకుండా చేసిందని మనసులో మాట బయటపెట్టాడు.





















