Virat Kohli 62 Runs vs CSK IPL 2025 | ఆరెంజ్ క్యాప్ ను మళ్లీ లాక్కున్న కింగ్ కొహ్లీ | ABP Desam
కింగ్ విరాట్ కొహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల దాహం చూపిస్తున్నాడు. రన్ మెషీన్ లా వింటేజ్ కొహ్లీని మళ్లీ పరిచయం చేస్తూ హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఒక్క సారి ఫామ్ లోకి వస్తే తనను ఎవ్వరూ ఆపలేరన్నట్లు 33 బాల్సే ఆడిన కొహ్లీ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 62 పరుగులు చేసిన కొహ్లీ ఆర్సీబీ కి భారీ స్కోరుకు బాటలు వేయటంతో పాటు సీజన్ లో ఎవ్వరికీ అందని స్థాయిలో ఏడో హాఫ్ సెంచరీ సాధించి ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ నుంచి తిరిగి సొంతం చేసుకున్నాడు. నిన్న మ్యాచ్ తో కొహ్లీ కొన్ని రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. ఓ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. నిన్న ఆర్సీబీ తరపున 300 సిక్సర్ బాదిన కొహ్లీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అంతే కాదు నిన్నటితో 8500 ఐపీఎల్ పరుగులను కూడా కంప్లీట్ చేశాడు కొహ్లీ. ప్రస్తుతం ఈ సీజన్ లో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ తో కొహ్లీ వెనుకే ఒక మ్యాచ్ తక్కువ ఆడి ఒక్క పరుగు తక్కువతో సాయి సుదర్శన్ ఉన్నాడు. తన కింద మూడో స్థానంలో సూర్య, నాలుగో స్థానంలో బట్లర్, ఐదో స్థానంలో గిల్ ఉన్నారు. వీళ్లందరి మధ్య పరుగుల తేడా 50-60 మాత్రమే ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్లే టీమ్స్ ని బట్టి అక్కడ వాళ్లు చేసే ఫర్ ఫార్మెన్స్ బట్టి ఆరెంజ్ క్యాప్ ఎవరిది అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈ రేసులో కొహ్లీ ఉంటే మాత్రం కంప్లీట్ డామినేషన్ ఖాయం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే కిరీటం ఉండాల్సింది మహారాజు దగ్గరే కాబట్టి.





















