Sai Sudharsan Orange Cap IPL 2025 | మళ్లీ ఆరేంజ్ క్యాప్ లాక్కున్న సుదర్శన్
ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగు వీరులు ఆరెంజ్ క్యాప్ కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు. మొన్నా మధ్య బెంగుళూరు మ్యాచ్ గెలవగానే ఆరెంజ్ క్యాప్ కొహ్లీ దగ్గరకు వెళ్లింది. ఆ రోజు కింగ్ దగ్గరకు కిరీటం వచ్చింది అంటూ ఎలివేషన్స్ ఇచ్చారు కొహ్లీ ఫ్యాన్స్. కానీ అది ఆ మరుసటి రోజే సాయి సుదర్శన్ చేతికి వచ్చింది మళ్లీ. ఆ తర్వాత సాయి నుంచి సూర్య కుమార్ యాదవ్ కి వెళ్తే..నిన్న మళ్లీ సన్ రైజర్స్ మీద మ్యాచ్ లో నిలకడ చూపించి 48పరుగులు చేసిన సాయి సుదర్శన్ మళ్లీ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఇక లీగ్ దశలో ఒక్కోో టీమ్ కు మహా అయితే నాలుగేసి మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి...ఆరెంజ్ క్యాప్ కోసం ఆఖరి పోరాటం మొదలైందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి సాయి సుదర్శన్ ఈ సీజన్ లో 500 పరుగులు దాటిన ఏకైక బ్యాటర్..తన వెనకే సూర్య కుమార్ యాదవ్, జోస్ బట్లర్, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ ఉన్నారు. సో చూడాలి ఆఖరి మ్యాచుల్లో సత్తా ఎవరు చాటుతారో ఆరెంజ్ క్యాప్ కిరీటాన్ని గెలుచుకునే సిసలైన మహారాజు ఎవరో.





















