KKR vs RR Match highlights IPL 2025 | రాజస్థాన్ పై 1 పరుగు తేడాతో విజయం సాధించిన కోల్ కతా | ABP Desam
ఈ సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా గెలవాలనే లక్ష్యంతో కోల్ కతా నైట్ రైడర్స్..ఆల్ రెడీ ఎలిమినేట్ అయిపోయినా మిగిలిన గేమ్స్ తమ ఎబిలిటీస్ ని టెస్ట్ చేసుకోవటం తో పాటు మిగిలిన జట్లకు షాక్ లు ఇవ్వటమే లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో హోరా హోరీగా ఇన్నింగ్స్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగింది. అయితే ఆఖరి బంతికి విజయం కేకేఆర్ నే వరించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. గుర్భాజ్, రహానే పార్టనర్ షిప్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఆరంభం ఏం అంత గొప్పగా రాలేదు. పదమూడు పరుగుల టీమ్ స్కోర్ కే ఓపెనర్ నరైన్ అవుట్ అవగా….మరో ఓపెనర్ గుర్భాజ్ తో కలిసి కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ ను అయితే నెలకొల్పాడు. గుర్భాజ్ 25 బాల్స్ లో 35పరుగులు చేయగా..రహానే 24 బాల్స్ లో ఓ ఫోర్ రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా కేకేఆర్ భారీ స్కోరు చేయకపోయినా కుప్పకూలిపోయి పరువు పోగోట్టుకోక లేదు.
2. రఘు వంశీ షో
అందరు చిన్న కుర్రాళ్లు దడదడలాడిస్తున్న ఈ సీజన్ లో కేకేఆర్ తరపున యంగెస్ట్ ప్లేయర్ ఆంగ్ క్రిష్ రఘువంశీ ఇవాళ కేకేఆర్ కి అండగా నిలబడ్డాడు. 31 బాల్స్ లో 5ఫోర్లతో 44పరుగులు చేసిన 20ఏళ్ల రఘువంశీ కేకేఆర్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.
3. రస్సెల్ బాదుడు...రింకూ క్యామియో
పరుగులు అంతగా రాకున్నా కేకేఆర్ 200 పరుగులు దాటిందంటే రీజన్..ఆండ్రే రస్సెల్...ఫినిషిర్ రింకూ సింగ్. రస్సెల్ 25 బాల్స్ లో 4ఫోర్లు 6 సిక్సర్లతో 57పరుగులు చేసి కేకేఆర్ కు 200 స్కోరుకు చేరువ చేస్తే..చివర్లో రింకూ సింగ్ 6 బాల్స్ ఆడి 2 సిక్సర్లతో 19పరుగులు చేయటంతో కేకేఆర్ కు రాజస్థాన్ కు 207పరుగుల టార్గెట్ సెట్ చేయగలిగింది.
4. జైశ్వాల్ మినహా అంతా తుస్ టపాస్
207పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్, పరాగ్ మినహా మిగిలిన వాళ్లంతా చేతులెత్తేశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో చిన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, కునాల్ సింగ్, ధృవ్ జురెల్, హసరంగా ఇలా ఎవ్వరూ నిలవలేకపోయారు. జైశ్వాల్ మాత్రం 21 బాల్స్ లో 5ఫోర్లు ఓ సిక్సర్ తో 34పరుగులు చేసి కాస్త పోరాడాడు.
5. ధూం ధామ్ రియాన్ పరాగ్
ఈ మ్యాచ్ లో జైశ్వాల్ మినహా టాప్, మిడిల్ ఆర్డర్ లో ఎవ్వరూ రాణించని సందర్భంలో కెప్టెన్ రియాగ్ తన బాధ్యతను గొప్పగా తీసుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. చెత్త బంతులను శిక్షిస్తూ మంచి బంతులను రెస్పెక్ట్ చేస్తూ కేకేఆర్ పెట్టిన లక్ష్యాన్న కరిగించిన రియాన్ పరాగ్...45 బాల్స్ లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో 95పరుగులు చేసి అవుటయ్యాడు. హెట్మెయర్ తో కలిసి లక్ష్యం చేధన దిశగా RR సాగుతున్న క్రమంలో వీళ్లిద్దరూ అవుట్ అవటంతో RR శిబిరంలో నిరాశ నెలకొంది. కానీ శుభమ్ దూబే అద్భుతంగా పోరాడాడు. 14 బాల్స్ లో ఓ ఫోరు 2 సిక్సర్లతో 25పరుగులు చేసి శుభమ్...మ్యాచ్ ను ఆఖరి బంతి వరకూ తీసుకువచ్చాడు. చివరి బంతికి 3పరుగులు చేస్తే మ్యాచ్ రాజస్థాన్ గెలుస్తుందన్న టైమ్ లో బంతి ని సరిగ్గా కొట్టలేకపోయిన శుభమ్ మొదటి పరుగు తీసి...రెండు పరుగుకు రనౌట్ అవ్వటంతో కేకేఆర్ 1 పరుగు తేడాతో సంచలన తేడాతో విజయం సాధించింది. లీగ్ లో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.





















