IPL 2025 Fight For Top 2 Slot | ప్లే ఆఫ్స్ ఎప్పుడో ఫిక్స్..టాప్ 2 కోసమే పోరాటమంతా | ABP Desam
జనరల్ గా ఐపీఎల్ అంటే ఏంటీ..ప్రతీ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్లే టీమ్స్ ఏవనే ఫైట్ ఉండేది. ఈ సారి అలా కాదు. లీగ్ దశలో ఇంకా 8 మ్యాచ్ లు ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్తులు ఫిక్స్ అయిపోయాయి. మరి అర్హత సాధించిన జట్లు ఊరుకుంటాయా..టాప్ 2 లో ప్లేస్ సంపాదిద్దామని గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఐపీఎల్ లో టాప్ 2లో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లే ఆఫ్స్ 1 లో తలపడే ఆ రెండు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్ కి నేరుగా వెళ్లిపోతుంది. ఓడిన జట్టు కు మరోసారి ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ అని మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేత ఎవరు ఉంటారో వాళ్లతో ప్లే ఆఫ్స్ 2 ఆడి గెలిస్తే ఫైనల్ కి వెళ్లొచ్చు. సో అడ్వాంటేజ్ కోసం క్వాలిఫై అయిన టీమ్స్ ట్రై చేస్తుంటే..సీజన్ లో ఎలిమినేట్ అయిపోయి ఏదో నామ్ కే వాస్తే ఆఖరి లీగ్ మ్యాచ్ లు ఆడే జట్లు మాత్రం పగ పట్టేసినట్లు ఆడుతున్నాయి. వరుసగా మూడు రోజులుగా జరుగుతున్న మ్యాచ్ లు చూడండి. నిజమేనని మీకే అనిపిస్తుంది. అంతకు ముందు మొన్న జరిగిన మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించి పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతానికి టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ పై ఎలిమినేట్ అయిపోయిన LSG సంచలన విజయం సాధించి షాక్ ఇచ్చింది. టాప్ 2 ప్లేస్ గుజరాత్ కి ఇంకా కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లో పెట్టింది. మొన్నటికి టేబుల్ టాప్ 2 గా ఉన్న ఆర్సీబీకి ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన మన ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించటమే కాదు 42పరుగుల తేడాతో మట్టికరిపించి పాయింట్స్ టేబుల్ లో కిందకు దించి..ఆర్సీబీ నెట్ రన్ రేట్ ను కరిగించేసింది. ఇప్పుడు ఆర్సీబీ టాప్ 2 లో ప్లేస్ కొట్టాలంటే చచ్చినట్లు LSG పై గెలవాల్సిందే. నిన్నటికి నిన్న పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న పంజాబ్ కింగ్స్ కి ఎలిమినేట్ అయిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ, ముంబై మ్యాచ్ ల్లో గెలిచేసే టాప్ 1గా సీజన్ ముగిద్దాం అనుకున్న పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీ. ఇప్పుడు పంజాబ్ టాప్ 2 లో ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే కచ్చితంగా ముంబైపై గెలవాల్సిందే. అలా ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లను టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోనివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఎలిమినేట్ అయిపోయిన జట్లు.





















