GT vs MI Eliminator Match Highlights IPL 2025 | గుజరాత్ టైటాన్స్ పై 20పరుగుల తేడాతో నెగ్గిన ముంబై | ABP Desam
లీగ్ దశలో చాలా రోజుల పాటు టేబుల్ టాపర్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్, ముంబైల మధ్య ఈరోజు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై జీటీపై పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. అంతా అనుకున్నట్లుగానే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్ లో తన సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ తో జీటీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న జానీ బెయిర్ స్టో తోడుగా చెలరేగిన రోహిత్ 50 బాల్స్ లో 9 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 81పరుగులు చేసి అదరగొట్టాడు. మొదటి మ్యాచే ఆడుతున్నా అద్భుతంగా ఆడిన బెయిర్ స్టో 47పరుగులు చేయటం..తర్వాత సూర్య 33, తిలక్ 25, చివర్లో 3 సిక్సర్లతో పాండ్యా 22 పరుగులు చేయటంతో ముంబై 228 పరుగుల భారీ స్కోరు చేసింది. 229 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కు స్టార్టింగ్ లోనే పెద్ద దెబ్బ. కెప్టెన్ గిల్ 1 పరుగుకే అవుట్ కాగా...కుశాల్ మెండిస్ ఫీల్డింగ్ క్యాచ్ లు వదిలేసి..బ్యాటింగ్ లో టచ్ లోనే కనిపించినా దారుణంగా హిట్ వికెట్ అయ్యాడు. అయితే వాష్టింగ్టన్ సుందర్ సాయి సుదర్శన్ కి మంచిగా సపోర్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు తమిళనాడు కుర్రాళ్లు గుజరాత్ ను ఆల్మోస్ట్ గెలుపు దిశగా తీసుకెళ్లారు. ఓవర్ కి 10 రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేసిన సాయి సుదర్శన్ 49 బాల్స్ లో 80 పరుగులు చేశాడు . తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. కానీ బుమ్రా అద్భుతమైన యార్కర్ తో వాష్టింగ్టన్ ను అవుట్ చేయటంతో మ్యాచ్ మళ్లీ గాడి తప్పింది. ఒత్తిడి పెరిగిన సాయి కూడా అనవసర షాట్కు వెళ్లి గ్లీసన్ బౌలింగ్ లో బౌల్డ్ అవటంతో గుజరాత్ ఆశలు అడుగంటిపోయాయి. రూథర్ పోర్డ్, తెవాటియా, షారూఖ్ ఖాన్ షాట్స్ వెళ్లి హోప్స్ కల్పించినా నరాలు తెగే టెన్షన్ ను క్రియేట్ చేసినా టార్గెట్ భారీగా ఉండటంతో ఏం చేయలేకపోయారు. మొత్తంగా 208 పరుగులు చేసిన గుజరాత్ ముంబైకి 20 పరుగుల తేడాతో విక్టరీని అప్పగించింది. అద్భుత విజయం సాధించిన ముంబై క్వాలిఫైయర్ 2 లో పంజాబ్ తో తలపడనుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆర్సీబీ తో ఫైనల్ ఆడనుంది.





















