Dinesh Karthik LBW vs RR | RR vs RCB Highlights | దినేశ్ కార్తీక్ అవుట్ ఐతే అంపైర్ నాటౌట్ ఇచ్చారా..?
ఆర్ఆర్ వెర్సస్ ఆర్సీబీ మ్యాచులో ఓ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదే దినేశ్ కార్తీక్ LBW విషయం. అసలేం జరిగిందంటే..!
ఆర్ఆర్ వెర్సస్ ఆర్సీబీ మ్యాచులో ఓ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదే దినేశ్ కార్తీక్ LBW విషయం. అసలేం జరిగిందంటే..! 15వ ఓవర్ రెండో బంతికి రజత్‌ను అవేశ్ ఔట్ చేశాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన దినేశ్ బంతిని డిఫెండ్ చేద్దామని చూడగా అది ప్యాడ్లకు తాకింది.
అవేశ్ ఖాన్ అప్పీల్ చేయగా... గ్రౌండ్ లో అంపైర్ ఔటిచ్చాడు. దీంతో..వెంటన్ దినేశ్ కార్తీక్ రివ్యూ కోరాడు. టీవీ ఎంపైర్ దానిని రివ్యూ చేయగా..
అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ.. ఆ స్పైక్ బాల్ బ్యాట్ ను తగలడం వల్ల రాలేదని... ప్యాడ్ కు తగలడం వల్ల వచ్చిందని రాజస్థాన్ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్ టీమ్ డైరెక్టర్ సంగక్కర కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంపైర్లతో దీనిపై వాగ్వాదం పెట్టుకునే వరకు వెళ్లాడు. ఒకే... ఆర్సీబీ కి ఫేవర్ గా నిర్ణయం వచ్చింది కాబట్టి ఆర్ఆర్ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చు గానీ, మ్యాచ్ తో సంబంధం లేని మాజీ క్రికెటర్లు సైతం ఆ బాల్ బ్యాట్ కు తగల్లేదని అది అవుట్ అని ఫీలవుతున్నారు. ఈ మ్యాచ్ లో కామెంటేటర్ గా వ్యవహరించిన గావస్కర్ సైతం దీనిని అవుట్ గానే చెప్పాడు. ఇక గ్రౌండ్ బయట ఉన్న శ్రీశాంత్ వట్టి మాజీ క్రికెటర్లు అంపైర్ కు కళ్లు కనిపించట్లేదా అంటూ ట్వీట్ వేశారు. ఇదొక్కటనే కాదు.. ఈ ఐపీఎల్ లో అంపైర్లపై ఎప్పుడు రానంత నెగెటివిటీ వస్తుంది వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. అయితే ఆర్ఆర్ మ్యాచులో దినేశ్ కార్తీక్ 13 బంతుల్లో 11 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ ఓడిపోయింది కాబట్టి ఒకే. ఒకవేళ దినేశ్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ గెలిచి.. ఆర్ఆర్ ఓడి ఉంటే.. ఈ LBW నిర్ణయం పెద్ద వివాదంగా మారి ఉండేది.