Digvesh Singh Rathi vs Abhishek Sharma Fight | LSG vs SRH మ్యాచ్ లో తిట్టుకున్న దిగ్వేష్ రాఠీ, అభిషేక్ శర్మ | IPL 2025
LSG బౌలర్ దిగ్వేష్ రాఠీ గురించి తెలిసిందేగా. ఈ ఐపీఎల్ లో నోట్ బుక్ సెలబ్రేషన్ తో పిచ్చ పిచ్చగా వైరల్ అయ్యాడు. ఎవరినైనా అవుట్ చేస్తే అతని ముందుకు వెళ్లి చీటీ రాసివ్వటం ఇదంతా దిగ్వేష్ రాఠీ బలహీనత. నిన్న అలానే ఉద్రేకానికి లోనై న దిగ్వేష్ రాఠీ ఏకంగా టీమిండియా ఫ్యూచర్ సూపర్ స్టార్ అభిషేక్ శర్మతోనే గొడవకు దిగాడు. అసలేం జరిగింది అంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో లక్నో ఎకానా స్టేడియంలో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన
లక్నోను ఎప్పట్లానే మిచ్ మార్ష్, మార్ క్రమ్, పూరన్ ఆదుకోవటంతో 205 పరుగుల భారీ స్కోరు కొట్టింది. ఇప్పటివరకూ ఎకానా స్టేడియంలో ఏ టీమ్ కూడా 200 పరుగుల పైస్కోరును ఛేజ్ చేయలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ తో బౌలింగ్ కి దిగిన లక్నోను ఊహించని రీతిలో చావు దెబ్బ కొట్టాడు SRH ఓపెనర్ అభిషేక్ శర్మ. తన సహచర ఓపెనర్ ట్రావియెస్ హెడ్ లేడనే అనుమానమే రాకుండా అథర్వ తైదే, ఇషాన్ కిషన్ తో కలిసి LSG బౌలర్లను రఫ్పాడించాడు . 20 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 59పరుగులు బాదేశాడు అభిషేక్ శర్మ. 295 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అందులో రవి బిష్ణోయ్ ను అయితే ఓవర్ లో వరుసగా 4సిక్సర్లు కొట్టాడు. అందులో మూడు పార్క్ అవుట్ సిక్స్ లు. అంత దూకుడు మీదున్న అభిషేక్ శర్మను ఔట్ చేశాడు లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ. అప్పటికే SRH 7ఓవర్లోనే 99 పరుగులు చేసేలా దూకుడు చూపించిన అభిషేక్ శర్మ చేయాల్సిన డేమేజ్ చేసి వెళ్లిపోతుంటే దిగ్వేష్ రాఠీ గొడవకు దిగాడు. నోట్ బుక్ సెలబ్రేట్ చేస్తూ పోరా అన్నట్లు సైగ చేశాడు. దీంతో వెళ్లిపోతున్న అభిషేక్ ఆగిపోయి మరీ గొడవకు దిగాడు. అంపైర్లు, ఆటగాళ్లు అందరూ వచ్చి ఆపుతున్నా దిగ్వేష్, అభిషేక్ ఇద్దరూ తిట్టుకుంటూనే ఉన్నారు. ఆఖరకు అభిషేక్ శర్మ గ్రౌండ్ వదిలి బయటకు వెళ్లటంతో గొడవ సద్దుమణిగింది. అభిషేక్ అయిపోయినాా ఎక్కడా తగ్గని క్లాసెన్, కమిందు మెండిస్ LSG ని చిత్తు చేసి ఆరువికెట్ల తేడాతో ఓడించటంతో పాటు ఎకానా స్టేడియంలో ఫస్ట్ 200 ప్లస్ స్కోరు ఛేజ్ చేసి...LSG ని ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్లీ షేక్ హ్యాండ్స్ సమయంలో అభిషేక్, దిగ్వేష్ ఇద్దరూ సీరియస్ గా డిస్కస్ చేసుకుంటుంటే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వచ్చి కలుగ చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరితోనూ మాట్లాడిన శుక్లా ఇద్దరికీ కాంప్రమైజ్ చేశారు. మ్యాచ్ తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడంతా ఓకే అని అభిషేక్ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పాడు. మొత్తంగా దిగ్వేష్ రాఠీ చీటీలు రాసిచ్చే కార్యక్రమం ఇంత గొడవ తెచ్చిందన్నమాట.





















